ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నయా స్ట్రాటజీ.. ఎంటంటే..?

ABN, Publish Date - May 04 , 2024 | 09:40 AM

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.

CM Revanth Reddy

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.


నయా స్ట్రాటజీ ఇదే

రోజు ఏదో ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యల తర్వాత.. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. గత పదేళ్లలో మోదీ సర్కార్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శిస్తున్నారు. పదేళ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. తన పక్కన ఇద్దరు అభ్యర్థులు లోక్ సభకు పోటీ చేసే క్యాండెట్, అసెంబ్లీ ఇంచార్జీ ఉంటున్నారు. ఆ ఇద్దరి చేతిలో గాడిద గుడ్డు ఆకారంలో చేసిన నమూనా పట్టుకున్నారు. ప్రధాని మోదీ మనకు ఇచ్చింది ఇదే.. గాడిద గుడ్డు అంటున్నారు.


నమూనాపై సర్వత్రా ఆసక్తి

సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తోన్న గాడిద గుడ్డు నమూనాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆకారంలో పైన గుండ్రటి నమూనా ఉంది. దానిపై గాడిద గుడ్డు అని రాశారు. కింద బీజేపీ ఇచ్చింది ఇది అని క్యాప్షన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన చోట ఇదే నమూనాను ప్రదర్శిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.


Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 09:47 AM

Advertising
Advertising