ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Thummala Nageswara Rao: మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు

ABN, Publish Date - May 14 , 2024 | 01:52 PM

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.

Thummala Nageswara Rao

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswar Rao) లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేస్తామని తెలిపారు. ఈ వానాకాలం నాటికి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేస్తామని తుమ్మల వెల్లడించారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.


ఖమ్మం నగరానికి మున్నేరు గండం లేకుండా రక్షణ గోడలు.. నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. పామాయిల్ హబ్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మారనుందన్నారు. బుగ్గపాడు పుడ్ పార్క్ పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుతో రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. పోడు రైతులకు కాంగ్రెస్ పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలన లోనే దళితులు, గిరిజనులు, మైనార్టీల జీవితాల్లో వెలుగులు విరబూస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సకల జనులు సంతోషంగా ఉండేలా పాలన ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామన్నారు. తన రాజకీయ లక్ష్యం సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడమని తుమ్మల వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Loksabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్

AP News.. పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

Read Telangana News And Telugu News

Updated Date - May 14 , 2024 | 01:56 PM

Advertising
Advertising