AP Elections: దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు
ABN, Publish Date - Apr 15 , 2024 | 08:09 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో దొంగల రాజ్యం, రౌడీల రాజ్యం, హత్య రాజకీయాల రాజ్యంగా మారిందని ధ్వజమెత్తారు.
చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో దొంగల రాజ్యం, రౌడీల రాజ్యం, హత్య రాజకీయాల రాజ్యంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన మద్యం మాఫియా పెట్రేగిపోతుందని విరుచుకుపడ్డారు. మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేదని మండిపడ్డారు. పలమనేరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
Balakrishna: మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేటా ముంచిన జగన్
పలమనేరు ఎమ్మెల్యేపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మాఫీయా అంట కదా అని స్థానికులను అడిగారు. నియోజక వర్గంలో కనిపించర కదా..? ఓటేసి గెలిపిస్తే నెత్తి మీద టోపీ పెట్టాడన్నారు. ఇసుక, మట్టి మాఫియాకి అడ్డూ అదుపు లేదు. నదిలో ఇసుక లేకుండా మాయం చేశాడట కదా..? మళ్ళీ ఓటేస్తే పలమనేరు ప్రజలను అమ్మేస్తాడు. కౌటిల్య నదిలో ఇసుక దోచేశారు. కౌటిల్య ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కట్టించారు. ప్రాజెకులో ఇసుక తవ్వేసరికి నీటి కొరత ఏర్పడింది. తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితి. పలమనేరుకి ఎమ్మెల్యే తాగునీటి కష్టాలు తీసుకొచ్చాడు. సాగునీరు లేదు.. తాగునీరు లేదు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే ఇసుకను కూడా అమ్మేశాడు. మళ్ళీ గెలిస్తే భూములను అమ్మెస్తాడు అని’ షర్మిల మండిపడ్డారు.
‘కాంగ్రెస్ అధికారంలో వస్తే రూ.2 లక్షలు రైతు రుణాలు మాఫీ చేస్తాం. మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం అందజేస్తాం. పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మిస్తాం. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీద ఉంటుంది అని’ షర్మిల ప్రజలకు హామీనిచ్చారు.
AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 08:09 PM