Share News

100 Times Washed Ghee: శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:43 AM

ఈ మధ్య కాలంలో శత ధౌత ఘృత చాలా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా లో దీని తయారీ విధానం గురించి చాలా వీడియోలు కూడా ఉంటున్నాయి. ఇది ఆయుర్వేద పద్దతికి చెందిన ఒక అద్భుతమైన శక్తివంతమైన చర్మ సంరక్షణ పద్దతి.

100 Times Washed Ghee:  శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !
100 Times Washed Ghee

చర్మ సంరక్షణలో ఆయుర్వేదాన్ని చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో ఉన్న చాలా పద్దతులు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ మధ్య కాలంలో శత ధౌత ఘృత చాలా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా లో దీని తయారీ విధానం గురించి చాలా వీడియోలు కూడా ఉంటున్నాయి. ఇది ఆయుర్వేద పద్దతికి చెందిన ఒక అద్భుతమైన శక్తివంతమైన చర్మ సంరక్షణ పద్దతి అని చాలా మందికి తెలుసు. కానీ దీని వల్ల కలిగే లాభాలు ఏంటి?

రోజూ నానబెట్టిన పెసరపప్పు తింటే ఏం జరుగుతుందంటే.. !


  • పురాతన కాలం నుండి పాచుర్యంలో ఉన్న శత ధౌత ఘృత చర్మానికి పునరుజ్జీవాన్ని ఇస్తుంది. ఇది చర్మానికి అత్యంత శక్తివంతమైన పదార్థం. నెయ్యిని 100సార్లు కడగడం ద్వారా నెయ్యి మృదువుగా, తేలికగా మారుతుంది. దీన్ని తయారు చేయడం చాలా ఓపికతో కూడిన పని.

  • శత ధౌత ఘృత ఒక పద్దతి ప్రకారం తయారుచేస్తారు. నెయ్యిని వరుసగ 100సార్లు కడుగుతారు. ఈ 100 సార్లలో కూడా నీరు మార్చిన ప్రతిసారీ నెయ్యిని సుమారు 100సార్ల వరకు శుద్ది చేస్తారు. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇది చర్మం పోషక లక్షణాలను మెరుగుపరుస్తుంది.

ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!


  • ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలను ప్రధానంగా చెబుతారు. ఈ దోషాలను సమతుల్యంగా ఉంచడంలోనూ.. దోషాలను శాంతింపజేయడంలోనూ శత ధౌత ఘృత సహాయపడుతుంది. అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది పని చేస్తుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

  • గాయాలు, కాలిన గాయాలు, చికెన్ పాక్స్, మచ్చలు, హెర్పెస్, లెప్రసీ, ఇతర చర్మ వ్యాధుల చికిత్సకు శత ధౌత ఘృత సహాయపడుతుంది. శత ధౌత ఘృత ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా మారుతుంది. ఎలాంటి మార్కెట్ ఉత్పత్తులు దీని ప్రభావం ముందు పని చేయలేవు. రాగి పాత్ర సహాయంతో దీన్ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 12 , 2024 | 12:51 PM