Share News

Instant Coffee - Cancer: ఇన్‌స్టెంట్ కాఫీ అతిగా తాగితే క్యాన్సర్ వస్తుందా?

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:15 PM

ఇన్‌స్టెంట్ కాఫీ అలవాటు ఉన్న వారు అక్రిలమైడ్ అనే రసాయనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అక్రిలమైడ్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

Instant Coffee - Cancer: ఇన్‌స్టెంట్ కాఫీ అతిగా తాగితే క్యాన్సర్ వస్తుందా?

ఇంటర్నెట్ డెస్క్: కాఫీ అంటే ఇష్టపడే చాలా మంది తీరిక లేక ఇన్‌స్టెంట్ కాఫీ వైపు మొగ్గు చూపుతారు. ఇక కాఫీలోని కెఫీన్ అనే రసాయనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతారు. జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు మతిమరుపు, ఆల్జైమర్స్, టైప్ 2 డయాబెటిస్ నుంచి కాఫీ కొంత వరకూ రక్షణ ఇస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. అయితే, ఇన్‌స్టెంట్ కాఫీ అలవాటు ఉన్న వారు అక్రిలమైడ్ అనే రసాయనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు (Health).

Hair Dye - Greying: హెయిర్ డై వాడితే జుట్టు నెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..


ఏమిటీ అక్రిలమైడ్..

దీన్ని అక్రిలిక్ అమైడ్ అని కూడా అంటారు. ఎటువంటి వాసన ఉండని ఈ రసాయనాన్ని ప్లాస్టిక్ తయారీలో, మురుగు నీరు శుద్ధి ప్రక్రియల్లో వినియోగిస్తారు. అయితే, శరీరంలోకి అతిగా అక్రిలమైడ్ చేరితే క్యాన్సర్ ప్రమాదం కూడా పేరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బేక్డ్ ఫుడ్స్‌తో పాటు ఇన్‌స్టెంట్ కాఫీలో కూడా ఈ రసాయనం కొద్ది పాళ్లల్లో ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఆహారాన్ని 120 డిగ్రీలకు మించి వేడి చేసిన సందర్భాల్లో చక్కెరలు, అమైనోయాసిడ్స్ నుంచి అక్రిలమైడ్ పుడుతుంది. అంతేకాకుండా, కాఫీ గింజలను బాగా వేయించిన సందర్భాల్లో కూడా అక్రిలమైడ్ తయారవుతుంది. కాఫీ నుంచి ఈ రసాయనాన్ని పూర్తిస్థాయిలో తొలగించడం ప్రస్తుతానికైతే సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కాఫీ తాగిన ప్రతీసారి ఈ రసాయనం బారిన పడ్డట్టే.

Hairloss: జుట్టూడిపోతోందా? ఈ లిమిట్ దాటనంత వరకూ టెన్షన్ వద్దు!

అయితే, మనుషుల్లో అక్రిలమైడ్ నేరుగా క్యాన్సర్‌కు దారితీస్తుందని చెప్పే అధ్యనాలేమీ లేకపోయినప్పటికీ ఈ అవకాశాన్ని మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అక్రిలమైడ్ శరీరంలో అధికమొత్తంలో చేరకుండా ఉండేందుకు కాఫీ పరిమితంగా తాగడం శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు తింటున్న ఆహారంలో అక్రిలమైడ్ స్థాయిలు వైద్య ఏజెన్సీలు అనుమతించిన దానికంటే చాలా తక్కువగా ఉండటం ఓ సానుకూల అంశం. కానీ అక్రిలమైడ్‌తో క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించేందుకు అదనపు జాత్రలను కూడా వైద్యులు సూచిస్తున్నారు.

Red Wine - Cancer: రెడ్ వైన్‌ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..


వైద్యులు చెప్పే దాని ప్రకారం, కాఫీ కాకుండా ఇతర మార్గాల్లో అక్రిలమైడ్ శరీరంలో చేరకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

  • ధూమపానం మానేయాలి. పొగతాగే వారికి వీలైనంత దూరంగా ఉండాలి.

  • ఆహారాలను డీఫ్ ఫ్రై చేయకూడదు. ఈ తరహా వంట విధానంతో ఆహారంలో అక్రిలమైడ్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ

  • ఇక నిప్పుల మీద ఆహారాన్ని కాల్చే వాళ్లు వాటిని బొగ్గులా మాడ్చకుండా జాగ్రత్త పడాలి

  • టోస్టెడ్ బ్రెడ్ వినియోగం కూడా వీలైనంతగా తగ్గించాలి

  • వీలైనంత వరకూ ఆహారాన్ని ఆవిరిపై వండాలి లేదా మైక్రోవేవ్‌ను వినియోగించాలి

  • ఇన్‌స్టెంట్ కాఫీ, ఇతర కాఫీ ప్రత్యామ్నాయాలకు బదులు డార్క్ రోస్టెడ్ కాఫీని ఎంచుకోవాలి.

Latest and Health News

Updated Date - Nov 26 , 2024 | 03:26 PM