Health News: చలికాలం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే న్యాచురల్ రెమిడీస్ ఇవే..
ABN , Publish Date - Nov 27 , 2024 | 09:05 AM
శీతాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకుని హుషారుగా తిరగాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తినాలి.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం బిగుసుకుపోతున్నారు. చలి తీవ్రత రికార్డుస్థాయిలో నమోదవుతోంది. ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక రకాల సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులు ఉన్నవారికి చలికాలం గడ్డుకాలమనే చెప్పాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరం బిగుసుకుపోతుంది. కీళ్లు గట్టిపడడం, నడిచేందుకు జాయింట్లు సహకరించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో నొప్పులు ఎక్కువగా ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గరువుతుంటారు. అయితే ఈ నొప్పులను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
న్యాచురల్ రెమిడీస్ ఇవే..
శీతాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకుని హుషారుగా తిరగాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తినాలి. ఈ రెండింటినీ తగిన మోతాదులో శరీరానికి అందిస్తే ఎముకలు దృఢంగా మారుతాయి. తద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు. అలాగే క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా వంటివి తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
సాధారణంగా శీతాకాలంలో చాలా మంది విటమిన్-డి లోపానికి గురవుతుంటారు. శరీరానికి తగినంత ఎండ అందక ఇది జరుగుతుంటుంది. విటమిన్-డి అనేది ఎముకలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చలికాలం అది శరీరానికి అందకపోతే కీళ్ల నొప్పులు ఉన్నవారికి పెయిన్స్ మరింత తీవ్రతరం అవుతాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం మంచిది.
చలికాలంలో తగినంత మంచినీరు తాగడం అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా ఈ కాలంలో మనకు తెలియకుండానే నీరు తాగడం తగ్గిస్తాము. అయితే కీళ్ల నొప్పులతో బాధపడేవారు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేట్ అయ్యి ఫలితంగా కీళ్లనొప్పులు అధికం అవుతాయి.
శీతాకాలంలో చల్లదనానికి చాలా వరకూ శరీరం బిగిసుకుపోతుంది. అయితే కీళ్ల వాతం ఉన్నవారి పరిస్థతి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వేడి కాపడం వంటివి చేస్తే నొప్పులు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి..
Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..