Health: అధికంగా వ్యాయామం చేయడమూ ముప్పే.. షాకింగ్ విషయాలు మీకోసం..
ABN , Publish Date - Apr 15 , 2024 | 06:32 PM
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై ( Health ) అవగాహన ఏర్పడింది. పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి.
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై ( Health ) అవగాహన ఏర్పడింది. పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి. ఫిట్‌గా ఉండటానికి శారీరక శ్రమ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ప్రతిరోజూ అరగంట వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. అందుకే, నేటి యుగంలో, యువత వ్యాయామం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. జిమ్‌లో కష్టపడుతూ చెమటలు కక్కుతున్నారు. కానీ ఏదైనా పరిమితికి మించి చేస్తే ప్రయోజనం కలిగే బదులు హాని కలిగుతుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..
చాలా సార్లు ప్రజలు కూడా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకుంటారు. ఒక వ్యక్తి తన శారీరక సామర్థ్యానికి మించి ఎక్కువ వ్యాయామం చేస్తే శరీరం తట్టుకోలేదు. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. రన్నింగ్, వాకింగ్ ఇలా ఏ యాక్టివిటీ చేసినా కేలరీల బర్నింగ్ కే చేస్తున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్త్రీలకు రోజుకు 1800 కేలరీలు, పురుషులకు రోజుకు 2వేల కేలరీలు అవసరం. కాబట్టి ఎక్కువగా ఉన్న కెలోరీస్ ను కరిగించే ప్రయత్నాలు చేయాలి. ఎంత తింటున్నామో అంతే వ్యాయామం చేయాలని చాలా మంది భావిస్తుంటారు. కొంచెమే తిన్నా అది జీర్ణం అయ్యేందుకు వ్యాయామం చేస్తారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ayodhya: అయోధ్యలో రద్దీ నియంత్రణకు టీటీడీ సహాయం.. నివేదిక సమర్పణ..
నిపుణుల సలహా లేకుండా కేవలం అధిక వ్యాయామం చేస్తే అది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది బరువు తగ్గేందుకు ఉదయం, పగలు, రాత్రి భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేస్తారు. అయితే దీని వల్ల ప్రయోజనం కాకుండా శరీరానికి హాని కలుగుతుంది. కొన్ని రోజుల పాటు వ్యాయామం చేయకపోతే చిరాకు, ఆందోళన కలుగుతాయి.
మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.