Health News: పిజ్జాలు, బర్గర్లకు బాగా అలవాటు పడ్డారా? అయితే జాగ్రత్త..
ABN, Publish Date - Aug 09 , 2024 | 07:30 AM
జంక్ ఫుడ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎందుకంటే ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. టేస్టీగా ఉండేందుకు వీటి తయారీలో రకరకాల పదార్థాలను వాడుతుంటారు. అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే జంక్ ఫుడ్‌లో ఎక్కువగా మంది ఇష్టపడేవి మాత్రం పిజ్జా, బర్గర్ వీటిని చాలా మంది లొట్టలేసుకుని మరీ లాగించేస్తుంటారు. అయితే వీటిని రెగ్యులర్‌గా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎందుకంటే ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. టేస్టీగా ఉండేందుకు వీటి తయారీలో రకరకాల పదార్థాలను వాడుతుంటారు. అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే జంక్ ఫుడ్‌లో ఎక్కువగా మంది ఇష్టపడేవి మాత్రం పిజ్జా, బర్గర్ వీటిని చాలా మంది లొట్టలేసుకుని మరీ లాగించేస్తుంటారు. అయితే వీటిని రెగ్యులర్‌గా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిజ్జాలు, బర్గర్లు తరచూ తినడం వల్ల కలిగే అనార్ధాలు..
జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన వారికి ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు తినే వారికి హార్మోన్ల అసమతుల్యత, హైబీపీ పొంచి ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఇవి తరచూ తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఈస్ట్రోజన్ స్థాయిలు బాగా పెరుగుతాయని చెప్తున్నారు. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని అలెర్ట్ చేస్తున్నారు.
బర్గర్ల వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి తినడం ద్వారా ఒకేసారి ఎక్కువ మెుత్తంలో క్యాలరీలు ఉత్పత్తి అయ్యి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రెడ్ మీట్ ఉన్న బర్గర్లు తినడం ద్వారా శరీరంలో సంతృప్త కొవ్వులు చేరి చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడం, లిపో ప్రోటీన్స్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
పిజ్జాలు, బర్గర్లు తరచూ తినే వారిలో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి డయాబెటిస్ వచ్చే అవకాశాలూ మెండుగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. చిన్న వయసులోనే బాలికలకు పీరియడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే పనిగా పిజ్జాలు, బర్గర్లు తింటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా ఏర్పడడం అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు.
మంచి రుచి వాసనలు రావడం, అలాగే ఇంట్లో ఇద్దరూ ఉద్యోగస్థులు కావడం వంటి కారణాలతో ఎక్కువగా బయట ఆహారాన్ని తీసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలితో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని చెప్తున్నారు. వీలైనంత ఎక్కువగా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
Updated Date - Aug 09 , 2024 | 07:30 AM