ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Iron Deficiency: ఐరన్ లోపమా.. అయితే ఈ కూరగాయలు తప్పక తినండి..

ABN, Publish Date - Sep 22 , 2024 | 07:22 AM

రీరంలో ఐరన్ లోపాన్ని సమతుల్య ఆహారం ద్వారా తగ్గించవచ్చని వైద్యులు, డైటీషియన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు తరచుగా భాగం చేసుకోవాలని చెప్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఖనిజాల్లో ఐరన్ ఒకటి. అయితే ఇటీవల కాలంలో ఐరన్ లోపంతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. చాలా మందికి తమకు ఈ సమస్య ఉందన్న విషయం కూడా తెలియదు. ఐరన్ లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా దీన్ని లోపం వల్ల వచ్చే సమస్యల్లో రక్తహీనత ప్రధానమైనది. ఇది మహిళల్ని ఎక్కువగా వేధిస్తోంది. అయితే దీన్ని నివారిచేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


మహిళల్లో వచ్చే సమస్యలు..

ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అందితేనే శరీర కణాలు, చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు బాగా పని చేస్తుంది. మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఐరన్ లోపం ఉంటే కణాలకు ఆక్సిజన్ సరిగా చేరదు. దీన్ని వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో చాలా మంది మహిళలను ఈ సమస్య వేధిస్తోంది. సాధారణంగా పీరియడ్స్ సమయంలో రక్తం ఎక్కువగా పోయేవారికి, గర్బిణుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వల్ల వచ్చే ప్రధానమైన సమస్యల్లో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఉత్పాదకత సామర్థ్యం తగ్గడం, తలనొప్పి, అలసట, శ్వాస సరిగా ఆడకపోవడం, చేతులు, కాళ్లు చల్లబడటం, కాళ్లను కదలించాలనే కోరిక పెరగడం, నీరసం వంటివి కనిపిస్తాయి.


అయితే శరీరంలో ఐరన్ లోపాన్ని సమతుల్య ఆహారం ద్వారా తగ్గించవచ్చని వైద్యులు, డైటీషియన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు తరచుగా భాగం చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాటిలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడమే కారణం. ఇలాంటి కూరగాయలను తరచుగా తింటే ఐరన్ లోపం వల్ల వచ్చే అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తినాల్సిన కూరగాయలు ఇవే..

  • ఐరన్ లోపం నివారించేందుకు పచ్చి బఠానీలు దివ్య ఔషధమనే చెప్పాలి. వీటిల్లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీతన నుంచి బయటపడడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. పచ్చి బఠానీలు ప్రతిరోజు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

  • బీట్ రూట్‌ను తినడం వల్ల ఐరన్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఐరన్ పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. బీట్ రూట్ తరచుగా తినడం వల్ల ఎర్ర రక్తకణాల అభివృద్ధికి అవసరమైన ఐరన్‌ను శరీరానికి అందిస్తుంది. దాని వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి పెరిగి రక్తహీనత నుంచి బయటపడొచ్చు.

  • లీఫ్ క్యాబేజ్, చిలగడదుంపలు అనేవి కూడా ఐరన్ లోపాన్ని నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. చిలగడదుంపలో మన శరీరానికి కావాల్సిన ఐరన్ మెండుగా ఉంటుంది. ఇవి ప్రధానంగా రక్తహీనత తగ్గించి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. లీఫ్ క్యాబేజీలోనూ ఐరన్ బాగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం ద్వారా మహిళలు ఐరన్ లోపం నుంచి బయటపడి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

  • పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల 6.4మి.గ్రా. ఐరన్ శరీరానికి అందుతుంది. దీంతో మహిళలు రక్తహీతన నుంచి బయటపడే అవకాశం ఉంది. అందుకే దీన్ని రెగ్యులర్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Sep 22 , 2024 | 07:22 AM