ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

EEE Virus: అమెరికాను వణికిస్తున్న ‘ట్రిపుల్‌ ఈ’

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:35 AM

లాక్‌డౌన్‌ అంటే ఠక్కున కరోనా వైరస్సే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్‌ భయం వణికిస్తోంది.

  • 5 పట్టణాల్లో రాత్రిపూట లాక్‌డౌన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అంటే ఠక్కున కరోనా వైరస్సే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్‌ భయం వణికిస్తోంది. ఈస్ట్రన్‌ ఈక్వైన్‌ ఎన్‌కెఫలైటి్‌స (ట్రిపుల్‌ ఈ) అనే ఈ వైరస్‌ బారినపడకుండా ముందు జాగ్రత్తగా అక్కడి 5 పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. ఈ వైరస్‌ దోమ కుట్టడం వల్ల సోకుతుంది. ఇటీవల 80 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్‌ బారినపడినట్టు గుర్తించడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ వైరస్‌ సోకితే మరణాల రేటు 30ు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.


దీంతో ముప్పు తీవ్రత ఉందని భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌, డగ్లస్‌, సుటన్‌, వెబ్‌స్టర్‌ పట్టణాల్లో సాయంత్రం నుంచి ఉదయం వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోపు బయట పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కులను, వినోద కేంద్రాలను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 30 వరకు ఈ వేళలు పాటించాలని, తర్వాత చలి తీవ్రంగా ఉండే మరో నెలా 15 రోజుల పాటు సాయంత్రం 5 గంటలకల్లా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


బోస్టన్‌కు 64 కిలోమీటర్ల దూరంలోని ప్లైమౌత్‌ పట్టణంలో ఒక గుర్రానికి ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు. దాంతో అక్కడ కూడా అధికారులు సాయంత్రం నుంచి ఉదయం వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. కాగా, దోమల ద్వారా సోకే ఈ వైరస్‌ మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. దీనికి వ్యాక్సిన్‌, నిర్ధిష్టమైన చికిత్స లేవని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పేర్కొంది. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. ఒక్కోసారి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. 2020 తర్వాత మసాచుసెట్స్‌ రాష్ట్రంలో ఈ వైరస్‌ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. 2019లో 12 మందికి ఈ వైరస్‌ సోకగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Aug 26 , 2024 | 05:35 AM

Advertising
Advertising
<