ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:46 PM

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.

UP Encounter

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్‌లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఖలిస్తానీ కమాండోస్‌ దళానికి చెందిన వీరు పురానాపుర్ పరిధిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్‌‌కు దారితీశాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ పోలీస్ పోస్ట్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఖలిస్తానీ కమాండోస్‌ దళానికి చెందిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు పిలిభీత్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆచూకీ తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. పంజాబ్‌, యూపీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌‌లో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరగడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాదులను వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అక్కడ చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.


ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు గుర్విందర్ సింగ్, వీరేందర్ సింగ్ అలియాస్ రవి, జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. గురుదాస్‌పూర్‌కు చెందిన వీరంతా.. పంజాబ్‌లోని పోలీస్ పోస్ట్‌‌లపై గ్రెనేడ్లు, బాంబులు విసిరిన ఘటనలో నిందితులని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత నిందితుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 07:39 PM