ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Air India: 2600 ఉద్యోగాలకు 25 వేలమంది కొలువు వేటలో తొక్కిసలాట!

ABN, Publish Date - Jul 18 , 2024 | 04:44 AM

విమానాశ్రయ లోడర్‌ ఉద్యోగాల కోసం ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ముంబయి విమానాశ్రయం వద్ద చేపట్టిన భర్తీ కార్యక్రమం మంగళవారం దాదాపు తొక్కిసలాట వంటి పరిస్థితికి దారితీసింది.

  • ముంబై విమానాశ్రయం వద్ద ఘటన

  • నిరుద్యోగం రికార్డులు బద్దలు: ప్రియాంక

ముంబయి, జూలై 17: విమానాశ్రయ లోడర్‌ ఉద్యోగాల కోసం ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ముంబయి విమానాశ్రయం వద్ద చేపట్టిన భర్తీ కార్యక్రమం మంగళవారం దాదాపు తొక్కిసలాట వంటి పరిస్థితికి దారితీసింది. దీంతో దరఖాస్తులు ఇచ్చి వెళ్లిపోవాలని నిర్వాహకులు అభ్యర్థులను కోరాల్సి వచ్చింది. 2600 ఉద్యోగాల కోసం ఏకంగా 25000 మందికి పైగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. చివరికి తమకు 25,000 దరఖాస్తులు అందినట్లు నిర్వాహకులు ప్రకటించారు.


200 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ కేంద్రం వద్దకు వేలాది మంది పరుగులు తీస్తోన్న దృశ్యాలు, వాహనాలు, చెట్లపైకి ఎక్కి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక దీన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం ‘ఎక్స్‌’లో ఒక పోస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ముంబయిలో మాట్లాడుతూ దేశంలో కోట్లమందికి ఉపాధి కల్పించి తాము రికార్డులు బద్దలు కొట్టామని పేర్కొన్నారన్నారు. అదే ముంబైకి వేలాది మంది నిరుద్యోగులు కేవలం కొన్ని ఉద్యోగాల కోసం వచ్చారని, ఇలా దేశంలో నిరుద్యోగం రికార్డులు బద్దలయ్యాయని ఎద్దేవా చేశారు.

Updated Date - Jul 18 , 2024 | 04:44 AM

Advertising
Advertising
<