ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Budget 2024: యువత, రైతులకు ప్రాధాన్యత.. బంగారు ప్రియులకు గుడ్‌న్యూస్.. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

ABN, Publish Date - Jul 23 , 2024 | 02:41 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Nirmala Sitharaman

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల విశ్వాసానికి కృతజ్ఞుతలు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కొనసాగిస్తూ.. భారతీయులందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులను పరిశీలించినప్పడుు దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికంటే మెరుగ్గా ఉందన్నారు. 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లుగా చెప్పుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Budget 2024: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల కోసం కొత్త పథకం..!


బడ్జెట్‌లో ప్రాధాన్యతలు..

ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో.. రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ.. ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలను బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు.

Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..


పన్నుల శ్లాబుల్లో..

పన్నుల శ్లాబుల విషయంలో పెద్ద ఊరట లేనప్పటికీ.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ విషయంలో కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని 50 శాతం పెంచినట్లయ్యింది. దీంతో రూ.17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కొత్త శ్లాబులు ఇలా..


బడ్జెట్‌లో మొత్తం..

  • కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు

  • మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు

  • పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు

  • ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా)

  • అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు(అంచనా)

  • Budget 2024: వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు..


తగ్గనున్న ధరలు..

కేంద్రబడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్‌కు సంబంధించిన మూడు రకాల ఔషధాలను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా ప్రకటించారు. దీంతో మూడు రకాల ఔషధాలు తక్కువ ధరకు లభించనున్నాయి.


బడ్జెట్‌లో కీలక అంశాలు..

  • మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు

  • పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్‌లో డార్మిటరీ వసతి సౌకర్యం

  • ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ

  • బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు

  • పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం

  • బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

  • 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ

  • బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం

  • ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు

  • బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు

  • దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం

  • గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు

  • ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ.

  • అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం

  • రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు

  • ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న లక్ష కంటే తక్కువ జీతం ఉన్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటన

  • రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం

  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి


Budget 2024: బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ నుంచి గుడ్ న్యూస్..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 23 , 2024 | 02:41 PM

Advertising
Advertising
<