ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

ABN, Publish Date - Mar 04 , 2024 | 03:01 PM

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.

పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీపై ( PM Modi) ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది. మోదీ (PM Modi) కుటుంబ సభ్యులం అని మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ఎక్స్‌లో తమ బయోలో మోదీ కా పరివార్ అని రాసుకొచ్చారు. మేం మోదీ కుటుంబ సభ్యులం అని స్పష్టం చేశారు. ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ బయోను మార్చుకున్నారు. మోదీ కుటుంబ సభ్యులం అని గట్టి కౌంటర్ ఇచ్చారు.

లాలూ ఏమన్నారంటే..?

పాట్నాలో ఆదివారం జరిగిన విశ్వాస్ ర్యాలీలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మోదీకి కుటుంబం లేదు. పిల్లలు లేరు. దేశంలో ఎక్కువ మంది పిల్లలు కనేవారిపై కామెంట్లు చేస్తున్నారు. రాజ వంశ రాజకీయాలు అని విమర్శలు చేస్తున్నారు. కుటుంబమే లేని మీరు హిందువు కూడా కారు. హిందువు అయితే తల్లి, తండ్రి చనిపోతే దండం పెడతారు. జట్టు, గడ్డం తీసుకుంటారు. మరి మీరు ఎందుకు జుట్టు తీయలేదో సమాధానం చెప్పాలి అని’ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. ఆ వెంటనే మోదీ వెంట తాము ఉన్నాం అని, మోదీ కుటుంబ సభ్యులం అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 03:01 PM

Advertising
Advertising