ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: కీచక టీచర్.. విద్యార్థినిపై దొంగతనం నేరం మోపి.. బట్టలు విప్పించి..

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:14 PM

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానిపై విచారణ జరిపి శిక్ష వేసే అధికారం పోలీసులు, న్యాయవ్యవస్థకు ఉంది. కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రెచ్చిపోతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరు ( Bengaluru) లోనూ అలాంటి ఘటనే జరిగింది.

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానిపై విచారణ జరిపి శిక్ష వేసే అధికారం పోలీసులు, న్యాయవ్యవస్థకు ఉంది. కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రెచ్చిపోతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరు ( Bengaluru) లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఓ విద్యార్థిని దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఆమెతో బలవంతంగా దుస్తులు విప్పించారు. తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు రెండు రోజుల అనంతరం సూసైడ్ చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే స్కూల్ లోని టీచర్ పర్సులో నుంచి రెండు వేల రూపాయలు దొంగతనం చేసిందని ఆరోపణలు మోపారు. తాను తీయలేదని తనకేమీ తెలియదని చెబుతున్నా వినిపించుకోకుండా సదరు ఉపాధ్యాయుడు ఆమెతో దుస్తులు విప్పించాడు. అంతటితో ఆగకుండా బాలిక ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేసేందుకు సమీపంలోని ఆలయానికీ తీసుకెళ్లడం గమనార్హం.

సంఘటన జరిగిన అనంతరం బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. రెండు రోజులుగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. అదే పాఠశాలలో చదువుతున్న బాధితురాలి సోదరి ద్వారా ఈ విషయాలు తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతదేహానికి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై మాట్లాడేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించడం గమనార్హం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 03:14 PM

Advertising
Advertising