Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?
ABN, Publish Date - Jun 23 , 2024 | 07:17 PM
లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు సోమవారం ఈ అంశంపై విచారణ కోరుతామని తెలిపారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో సాక్ష్యాలను చూపడంలో ఈడీ(ED) విఫలమైందని అన్నారు.
కేజ్రీకి మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని కోరగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్‌పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. స్టేకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఈ పాలసీతో చాలా మంది ప్రముఖులు అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
ఈ కేసులో చాలా మంది ప్రజాప్రతినిధులపై దాడులు నిర్వహించింది. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితర కీలక నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు. తాజాగా మరోసారి బెయిల్‌పై స్టే రావడంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు.
For Latest News and National News click here
Updated Date - Jun 23 , 2024 | 07:17 PM