ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: అబ్బే అది నేను కాదు.. రాహుల్ గాంధీ కామెంట్లపై అశోక్ చవాన్

ABN, Publish Date - Mar 18 , 2024 | 04:22 PM

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను బీజేపీ నేత అశోక్ చవాన్ తప్పు పట్టారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి చవాన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబైలో ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. పార్టీ వీడిన నేత ఒకరు, తన తల్లి సోనియా వద్దకొచ్చి ఏడ్చారని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అశోక్ చవాన్ పేరును రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో తాను సోనియా గాంధీని కలువలేదని చవాన్ స్పష్టం చేశారు.

ముంబై: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన కామెంట్లను బీజేపీ నేత అశోక్ చవాన్ తప్పు పట్టారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి చవాన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబైలో ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. పార్టీ వీడిన నేత ఒకరు, తన తల్లి సోనియా వద్దకొచ్చి ఏడ్చారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. అశోక్ చవాన్ పేరును రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో తాను సోనియా గాంధీని (Sonia Gandhi) కలువలేదని చవాన్ స్పష్టం చేశారు.

‘హిందు మతంలో శక్తి అనే పదం ఉంది. మనం శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. శక్తి అంటే ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. ఈవీఎంలో రాజు ఆత్మ నిక్షిప్తమై ఉంటుంది. దేశంలోని ప్రతి సంస్థ, ఈడీ, సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ విభాగాల్లో ఉంటుంది. సోనియా జీ ఈ శక్తితో పోరాడే పవర్ తన వద్ద లేదు. జైలుకు వెళ్లే ఓపిక లేదు. అందుకే పార్టీ మారాల్సి వస్తోంది. తన తల్లి సోనియా వద్ద సీనియర్ నేత ఏడ్చారు అని’ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇలా ఒక్కరే కాదు చాలా మందిని బీజేపీ నేతలు భయ పెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.

‘రాహుల్ గాంధీ ఎక్కడ అశోక్ చవాన్ పేరు ప్రస్తావించలేదు. తన గురించి రాహుల్ చెప్పాలని అనుకుంటే, అది నిరాధారం అవుతుంది. పార్టీ వీడే ముందు సోనియా గాంధీని తాను కలువలేదు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సత్యదూరం అని, ఇది పొలిటికల్ స్టంట్ అని’ అశోక్ చవాన్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 04:23 PM

Advertising
Advertising