Congress: పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..
ABN, Publish Date - Apr 07 , 2024 | 11:21 AM
ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి.
ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి. ఎన్నికలు ఏవైనా సరే.. పార్టీకి మేనిఫెస్టో ఉండాల్సిందే. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. మహిళలకు ఏటా రూ.లక్షతో పాటు ఉన్నత విద్యలో 50శాతం మహిళల రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. పంచ పత్ర పేరుతో 25 హామీలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. మేనిఫెస్టోలోని హామీలు సమాజాన్ని విభజించే ఉద్దేశ్యంతో ఉన్నాయన్నారు. బుజ్జగింపు రాజకీయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఇది భారత్‌లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్ కు సంబంధించిన మేనిఫెస్టో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం
" దేశంలో ఎవరూ ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణను కోరుకోవడం లేదు. బాల్య వివాహాలు, బహుభార్యత్వాన్ని సమర్థించడం లేదు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ కుట్ర." అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రత బోరా స్పందించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడడమే తమ మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 07 , 2024 | 11:21 AM