ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: మిస్టర్ మోదీ మమ్మల్ని కాల్చేయండి.. ఆప్ నేతల ఫైర్

ABN, Publish Date - Mar 23 , 2024 | 06:49 PM

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో (Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ (Modi) లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. మిస్టర్ మోదీ మమ్మల్ని కాల్చేయాలని సౌరభ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ఢిల్లీలో రౌడీయిజం మొదలైంది. పోలీసుల చర్యలో అర్థమవుతోంది. ఇక్కడ శాంతి భద్రతలు అమల్లో లేవు. మీరు మమ్మల్ని పార్టీ ఆఫీసు వెళ్లేందుకు అడ్డుకుంటున్నారు. తమ పార్టీ అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి..? తమను నియంత్రించే అధికారం పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చింది. తమ పార్టీ నేతలపై జరుగుతున్న వివక్ష గురించి కేంద్ర ఎన్నికల సంఘం కలుగజేసుకోవాలి. ఇదే అంశం గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. ఢిల్లీలో పోలీసుల దూకుడుపై ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని’ సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

పార్టీ కార్యాలయానికి సీల్ వేయడం ఏంటీ అని మంత్రి అతిషి మండిపడ్డారు. ఇది రాజ్యాంగాన్ని విస్మరించడమేనని విరుచుకుపడ్డారు. ఓ జాతీయ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేందుకు ఆంక్షలు విధిస్తారా..? ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘాన్ని సమయం కోరామని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 07:56 PM

Advertising
Advertising