Bangalore: దుమారం రేపిన మాజీసీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:24 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, మండ్య లోక్‌సభ అభ్యర్థి కుమారస్వామి(Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
- గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారంటూ నోరు జారిన వైనం
- ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
- మహిళా కమిషన్ నోటీసులు
- బాధ కలిగి ఉంటే క్షమించండి: కుమారస్వామి
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, మండ్య లోక్‌సభ అభ్యర్థి కుమారస్వామి(Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శనివారం ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా తుమకూరు రోడ్‌షోలో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవయ్యాయి. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరు, మండ్యతోపాటు వివిధ ప్రాంతాల్లో కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మండ్యలోని సంజయ్ సర్కిల్లో గోబ్యాక్ కుమారస్వామి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వివాదం కాస్త ఎన్నికలవేళ రాజకీయ కోణంలో మరింత తీవ్రమయింది. కొడగులో మాజీ ఎమ్మెల్సీ వీణా అచ్చయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన కుమారస్వామి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మహిళలకు రక్షణగా నిలిచిందన్నారు. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. వివాదం తీవ్రమవుతున్న తరుణంలో సోమవారం జేడీఎస్(JDS) కార్యాలయంలో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తాను మహిళలను కించపరచాలని మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల గ్యారెంటీ పేరుతో ఇచ్చి ప్రతి కుటుంబంపై రూ.10వేల దాకా లూటీ చేస్తోందని మండిపడ్డారు.
ఇదికూడా చదవండి: మిస్టర్ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం
తన వ్యాఖ్యలు ఎవరినయినా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. అయినా కుమారస్వామికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. కుమారస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్టు కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మిచౌదరి తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మహిళలకు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు చేదోడుగా ఉండాలని, పదవులు పొందేవేళ, ప్రమాణ స్వీకారాల సందర్భంగా మహిళలకు గౌరవం ఇస్తామని హామీ ఇస్తారని, కానీ రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాగా బెళగావి బీజేపీ ఇన్‌చార్జ్ సంజయ్‌పాటిల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ గురించి పరోక్షంగా అక్క నియోజకవర్గంలో బీజేపీ సభకు భారీగా జనం వచ్చారని, అక్కకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. స్లీపింగ్ మాత్రలు లేదా ఎక్స్‌ట్రా పెగ్ వేసుకోవాలని హేళన చేసేలా మాట్లాడారు. ఈ మేరకు కుమారస్వామితోపాటు సంజయ్‌పాటిల్‌కు నోటీసులు జారీ చేశారు. రెండువారాల్లో వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: మిస్టర్ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం
ఇవి కూడా చదవండి...
TS News: స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!
Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..