Share News

Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. జలదిగ్బంధంలో ఐటీ సీటీ

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:07 PM

ఎలహంకలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీఎస్) బస్సు, పలు వాహనాల ఇంజన్ల లోకి నీళ్లు చేరడంతో ఎలహంక ఓల్డ్ టౌన్ రోడ్డుపైనే అవి నిలిచిపోయాయి. క్రేన్లను రంగంలోకి దింపిన అధికారులు రోడ్లపైన నిలిచిపోయిన వాహనాలను తొలగించే చర్యలు చేపట్టారు.

Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. జలదిగ్బంధంలో ఐటీ సీటీ

బెంగళూరు: కర్ణాటక (Karnataka)ను భారీ వర్షాలను (Heavy rains) ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రాజధాని నగరమైన బెంగళూరు (Bengaluru) లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్లు, ఇళ్లు పాక్షికంగా నీటిలో చిక్కుకుపోవడంతో పలువురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రోడ్లు, రహదారులపై రాకపోకలకు ఉదయం నుంచి తీవ్ర అంతరాయం తలెత్తింది. సాధారణ జనజీవన స్తంభించింది.


బెంగళూరు నగరంలోని పలు ప్రధాన రోడ్ల బాగా దెబ్బతినడం, గుంతలు తేలడంతో ద్విచక్ర వాహనాలు సహా పలు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్లు మాయమై, గుంతలు ప్రాణాంతకంగా మారుతున్నాయని పలువరుు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులను మోహరించారు.

Gautami: నటి గౌతమికి అన్నాడీఎంకే ప్రచార పదవి


ఎలహంకలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీఎస్) బస్సు, పలు వాహనాల ఇంజన్ల లోకి నీళ్లు చేరడంతో ఎలహంక ఓల్డ్ టౌన్ రోడ్డుపైనే అవి నిలిచిపోయాయి. క్రేన్లను రంగంలోకి దింపిన అధికారులు రోడ్లపైన నిలిచిపోయిన వాహనాలను తొలగించే చర్యలు చేపట్టారు. చిక్కబొమ్మసంద్రలో 60కి పైగా ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అంబేద్కర్ నగర్‌లో వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో పలు కుటుంబాలు పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మాన్ఫో కన్వెన్షన్ సెంటర్, మాన్యత టెక్ పార్క్‌లు సైతం నీటి మడుగుల్లా మారాయి. అమృతహళ్లి, చిక్కబనవర, మారుతీనగర్ ప్రాంతాలు సైతం జలదిగ్బంధలో ఉన్నాయి.


కాగా, మంగళవారం సైతం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో మరిన్ని వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. బెంగళూరు సిటీలోని ఎకోస్పేస్ జంక్షన్‌ వద్ద ఔంటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విప్రో జంక్షన్ వద్దనున్న సర్జాపుర రోడ్డు, బీఆర్‌జీ లేఔట్ జంక్షన్ జలదిగ్బంధంలో ఉన్నాయి.


రాజకీయ విమర్శలు

వర్షాలకు బెంగళూరు సిటీ అతలాకుతలం కావడంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలతో బెంగళూరు వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్తా నీటిలో తేలియాడే నగరంగా మారిందని జేడీఎస్ ఎద్దేవా చేసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజనరీ నాయకత్వంలో బెంగళూరు భవిష్యత్తు కూడా ఊగిసలాడుతోందని, బహుశా వచ్చే టర్మ్‌లో రోడ్లకు బదులు పడవలపై ఖర్చు చేయాల్సి రావచ్చని విమర్శించింది.


విమానాల రాకపోకలపై ప్రభావం

భారీ వర్షాల కారణఁగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారంనాడు పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 20కి పైగా విమానాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకోగా, నాలుగు విమానాలను దారి మళ్లించారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చే థాయ్ లయిన్ ఎయిర్ ఫ్లైట్‌‌ను చెన్నైకి మళ్లించారు. ఢిల్లీ నుంచి వచ్చే ఒక ఎయిర్ ఇండియా విమానం, ఢిల్లీ, హైదరాబాద్, చండీగఢ్ నుంచి వచ్చే 3 ఇండిగో విమానాలను చెన్నైకు మళ్లించారు.


ఇవి కూడా చదవండి..

Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..

Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 22 , 2024 | 04:10 PM