ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Parliament Elections: సిద్ధంగా ఉండండి.. ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు?

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:47 PM

ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి..

Election May Held Again Within A Year

ఓవైపు బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని కుండబద్దలు కొట్టారు. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఆయన ఓ వీడియో షేర్ చేస్తూ.. ఆ సంచలన ప్రకటన చేశారు.


ఏడాదిలోపే ఎన్నికలు

‘‘కార్మికులారా.. సిద్ధంగా ఉండండి. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. ఓవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadvanis) రాజీనామా ఇవ్వడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కుర్చీ వణుకుతోంది. ఇంకోవైపు.. భజన్‌లాల్ శర్మ ఊగిసలాడుతున్నాడు. ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.. కానీ ఈలోపే జేడీయూ అధికార ప్రతినిధి ‘అగ్నివీర్’ పథకం రద్దు, కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేవనెత్తిన సమస్యలే’’ అని భూపేష్ బఘేల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీనికితోడు బీజేపీలో అంతర్గత కల్లోలం నడుస్తోందని.. ఇటువంటి పరిస్థితిలో దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.


ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధం

గత రెండు ఎన్నికల్లో స్వయంగా మెజారిటీ మార్క్ (272) దాటిన బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 240 సీట్లనే గెలుచుకుంది. అంటే.. మ్యాజిక్ ఫిగర్‌కు 32 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటుకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది. ఎన్డీఏ కూటమిగా మొత్తం 293 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యంగా.. టీడీపీ, జేడీయూ పార్టీలు అత్యంత కీలకంగా నిలిచాయి. ఆ రెండు పార్టీలు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. అటు.. శుక్రవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు సమావేశమై నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎంపిక చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడంతో.. 9న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మోదీ రెడీ అవుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 09:47 PM

Advertising
Advertising