ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: ఏడు బడ్జెట్‌లు.. ఏడు రంగుల చీరలు.. నిర్మలమ్మ సందేశం అదేనా!?

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:59 PM

Budget 2024: కర్ణాటక ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. అయితే, ఆమె ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్‌లూ విశేషమే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. ప్రత్యేక చీరలో కనిపించారు.

Nirmala Sitaraman

Budget 2024: కర్ణాటక ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. అయితే, ఆమె ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్‌లూ విశేషమే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. ప్రత్యేక చీరలో కనిపించారు. ఇలా ఏడు బడ్జెట్ల సమర్పణలో ఏడు రంగులలో చీరలు ధరించారు. ఆ చీరల ద్వారా ఆధ్యాత్మికతతో సహా అనేక అంశాలను చాటిచెప్పారు. దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో ఒక సందేశం పంపించారు. మరి ఏడు సార్లు, ఏడు రంగుల చిరల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. దేశానికి ఏ సందేశం పంపారు? ఆమె ధరించిన చీరల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..


ఎరుపు, నీలం, పసుపు, గోధుమరంగు, తెలుపు రంగు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా.. చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రతిసారి ఆయా రంగుల చీరలను ధరించారు. తాను కట్టుకున్న ప్రతి చీర భారతదేశంలోని ఏదో ప్రాంతం ప్రత్యేకతను వర్ణిస్తుంది. కొన్నిసార్లు అంతర్గతంగా, సూక్ష్మమైన బడ్జెట్ సందేశాలను కూడా అందిస్తోంది.


మంగళవారం నాడు లోక్‌సభలో బడ్జెట్‌-2024ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ దఫా ఏపీలో తయారైన మెజెంటా బార్డర్‌తో కూడి ఆఫ్-వైట్ చీరను ధరించారు. ఈ చీర ఏపీలోకి మంగళగిరిలో తయారు చేశారు. మంగళగిరి చీరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఆ చీర ధరించిన నిర్మలా సీతారామన్.. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఉంటాయని పరోక్ష సంకేతం ఇచ్చారని పలువురు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో మంగళగిరి పరిధిలోని అమరావతి సహా ఏపీకి భారీగా కేటాయింపులు చేశారు. ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరాతికి ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పరిశ్రమలు, రోడ్లు, ఇతర ప్రాజెక్టులకు భారీగానే కేటాయింపులు జరిపారు. అంతేకాదు.. ఈ చీరను ధరించడం ద్వారా ఆ ప్రాంత కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. చేనేత వస్త్రాలపై ప్రజలకు మక్కువ కలిగేలా చేశారు. వాటి గురించి ప్రజల్లో ఆలోచన వచ్చేలా చేశారు.


అంతకుముందు ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సమయంలో నీలిరంగు చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్‌కు చెందినది. ప్రసిద్ధ కంటా ఎంబ్రాయిడరీతో ఈ చీరను తయారు చేశారు. ఈ చీరపై ఆకు ముద్రలు స్పెషల్ అట్రాక్షన్. ఇది బెంగాల్‌లోని పురాతన ఎంబ్రాయిడరీ వర్క్‌లలో ఒకటి. బెంగాల్ నీలిరంగు చీర ధరించడాన్ని బట్టి కేంద్రం తమ రాష్ట్రానికి కేటాయింపులు భారీగా చేస్తుందని ఆ రాష్ట్ర ప్రజలు భావించారు. అంతేకాదు.. ఈ రంగు చీర ఆక్వాకల్చర్ ఉత్పాదకత పెంపుదలకు చిహ్నంగా పేర్కొనవచ్చు. భారతీయ మత్స్యరంగం అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా ఆమె నీలిరంగు చీరను ధరించారు. ఇందుకు అనుగుణంగానే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యశాఖకు రూ.2,584.50 కోట్లు కేటాయించారు. ఇది అత్యధిక వార్షిక కేటాయింపు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% అధికం.


కొత్త తరంలో ఉత్సుకత..

కాంటా ఎంబ్రాయిడరీతో ఈ టస్సార్ చీరను తయారు చేయడానికి ఫాబ్రిక్ ముక్కలను ఒక్కటి చేసి కుడతారు. సీతారామన్ ఈ చీరను చీరను ధరించడంతో.. స్థానిక చేనేతల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. కాంటా ఎంబ్రాయిడరీ స్టైల్ గురించి తెలుసుకునేందుకు ప్రజలు సైతం ఉత్సాహంగా ఉంటారు. అదే సమయంలో నేర్చుకునే అవకాశం కూడా ఉంది.


👉 2023లో నిర్మలా సీతారామన్ ఎరుపు రంగులో ఉన్న టెంపుల్ బార్డర్ చీరను ధరించారు. ఇది కర్ణాటకలోని ధార్వాడకు చెందిన ఇలకల్ పట్టు చీర. ఇది చేతితో నేసిన ఎంబ్రాయిడరీ చీర. ఆర్థిక మంత్రి ధరించిన చీరలో రథాలు, నెమళ్లు, కమలాలు ఉన్నాయి.

👉 2022 బడ్జెట్ సమయంలో ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఫేమస్ అయిన చేనేతను కళను ప్రోత్సహించేలా సీతారామన్ గోధుమరంగు బొమ్మకాయ్ చీరను ధరించారు.

👉 2021లో.. హైదరాబాద్‌ సమీపంలోని పోచంపల్లి గ్రామంలో మాత్రమే నేసే.. ఆఫ్ వైట్ చీరను ధరించారు. పోచంపల్లి చీరలు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్.

👉 2020లో పసుపు రంగు చీర ధరించారు నిర్మలా సీతారామన్. భారత సంప్రదాయం ప్రకారం పసుపు శుభం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ చీర భారతదేశం సంస్కృతి, సంప్రదాయాన్ని చాటిచెప్పింది.

👉 2019లో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. బంగారు రంగు అంచులతో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్‌ పత్రాలు తెచ్చే సూట్‌ కేస్‌ స్థానంలో బహీ ఖాతా (ఎర్నటి వస్త్రంతో చుట్టిన సంచీ)తో పార్లమెంట్‌కు వచ్చారు. ఈ బహీ ఖాతాపై జాతీయ చిహ్నమైన మూడు సింహాలు ఉన్నాయి.

👉 సీతారామన్ ఎంచుకునే అందమైన చీరలు ఒక్కో రాష్ట్రాన్ని సూచిస్తాయి. ఆ ప్రాంత చేనేత ప్రత్యేకతను, అక్కడి కళను చాటిచెబుతుంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ధరించిన ఒక్కో చీర మహిళల దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. సింపుల్‌గా, చేనేత వస్త్రాలను ధరిస్తూ.. భారతీయ కళలను నిర్మలా సీతారామన్ చాటిచెప్పారు.


Also Read:

అన్ని వర్గాల అభివృద్ధి బడ్జెట్ ఇది... మోదీ

పాకిస్తాన్‌కు వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్.. చివరకు?

ఆ లింకులపై క్లిక్ చేస్తే.. ఇక అంతే సంగతులు..!

For More National News and Telugu News..

Updated Date - Jul 23 , 2024 | 06:01 PM

Advertising
Advertising
<