ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cabinet Committee : 8 రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:31 AM

రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.

ఏపీ, తెలంగాణ, ఒడిసాల్లో 173.63 కి.మీ. కొత్త లైన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు. ప్రధాన మంత్రి గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిసా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ల్లో 900 కిలో మీటర్ల మేర వీటిని చేపడతారు. ఇందులో భాగంగా 64 కొత్త స్టేషన్లను నిర్మిస్తారు.

ఒడిసాలోని మల్కనగిరి నుంచి ఏపీలోని తూర్పు గోదావరి మీదుగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం వరకూ మల్కాన్‌గిరి- పాండురంగాపురం వయా భద్రాచలం మార్గంలో 173.63 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మిస్తారు. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఆకాంక్ష జిల్లాలైన తూర్పు సింగ్‌భమ్‌, కొత్తగూడెం, మల్కన్‌గిరి, కలహండి, నవరంగ్‌పూర్‌, రాయగడ జిల్లాలను ఈ ప్రాజెక్టులు అనుసంధానం చేస్తాయి.

Updated Date - Aug 10 , 2024 | 04:31 AM

Advertising
Advertising
<