ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:45 PM

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

ఢిల్లీ: బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. తుపాన్ ధాటికి అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో చాలా మంది మరణించారు.

వారందరికీ రూ.2 లక్షల పరిహారం అందించనున్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తుపాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలలో 40 మంది మరణించారు. రెండు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు." రెమల్ తుపాను అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లపై తీవ్రంగా ప్రభావం చూపింది. మరణించిన వారికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది" అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.


భారీగా ఆస్తి నష్టం..

రెమల్ తుపాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో, కక్‌ద్వీప్, నమ్‌ఖానా, ఫ్రేజర్‌గంజ్‌తో సహా అనేక తీర ప్రాంతాలలో ఆస్తులు, వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లింది. దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని 24 బ్లాక్‌లు, 79 మున్సిపల్‌ వార్డుల్లో దాదాపు 15 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వరదలు సంభవించిన తరువాత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నది ఒడ్డున కట్టలు తెగిపోవడంతో వరదలు వచ్చాయి. దీంతో మణిపుర్ ప్రభుత్వం మే 30, 31 తేదీలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకి రావద్దని హెచ్చరించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 04:46 PM

Advertising
Advertising