Share News

Delhi: ఈ శునకాలు పెంచుకుంటే కఠిన శిక్షలు.. 23 జాతుల కుక్కలను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 14 , 2024 | 03:22 PM

ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi: ఈ శునకాలు పెంచుకుంటే కఠిన శిక్షలు.. 23 జాతుల కుక్కలను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే

ఢిల్లీ: ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్, మాస్టిఫ్‌ సహా 23 జాతుల కుక్కల అమ్మకం, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే పెంపుడు జంతువులుగా ఉన్న ఈ జాతి కుక్కలను స్టెరిలైజ్ చేయాలని, సంతానోత్పత్తి జరగకుండా చూడాలని కేంద్రం సూచించింది. పౌరులు, పౌర వేదికలు, జంతు సంక్షేమ సంస్థల నుండి ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధించిన వాటిలో మిశ్రమ, సంకర జాతులు ఉన్నాయి. అవి క్రూరమైనవని మనుషులకు ప్రమాదకరమైనవని వైద్యులు అంటున్నారు.

పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్ వంటి జాతుల శునకాలు ఇందులో ఉన్నాయి. ఇతర జాతులలో సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్ంజక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బాండోగ్ ఉన్నాయి. నిషేధించిన శునకాలను పెంచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 03:29 PM