Share News

CJI Justice Chandrachud : బెయిల్‌ పిటిషన్లలో జడ్జిలకు కామన్‌ సెన్స్‌ అవసరం

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:50 AM

బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు కామన్‌ సెన్స్‌ అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

CJI Justice Chandrachud : బెయిల్‌ పిటిషన్లలో జడ్జిలకు కామన్‌ సెన్స్‌ అవసరం

  • సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు కామన్‌ సెన్స్‌ అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వారు బెయిల్‌ మంజూరు చేయకుండా సేఫ్‌గా తప్పుకోవడానికే ఇష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు.

అయితే ప్రతి కేసునూ నిస్సందేహంగా పరిశీలించడానికి ధ్రుడమైన ఇంగిత జ్ఞానం కావాలని పేర్కొన్నారు. బెంగళూరు లా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘కంపారిటివ్‌ ఈక్వాలిటీ అండ్‌ యాంటీ డిస్ర్కిమినేషన్‌’ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో న్యాయవాదులు, విద్యార్థులను ఉద్దేశించి చీఫ్‌ జస్టిస్‌ ప్రసంగించారు.

ట్రయల్‌ కోర్టుల్లో బెయిల్‌ పొందాల్సిన వ్యక్తులు అక్కడ సాధ్యం కాకపోవడంతో హైకోర్టులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. అక్కడా బెయిల్‌ లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఈ జాప్యం వలన ఏకపక్ష అరెస్టులను ఎదుర్కొంటున్న వారికి మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు.

ప్రతిపక్షాల ముఖ్యులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులను నిర్బంధించడం ద్వారా రాజకీయ ప్రేరేపిత విధానంలో ప్రభుత్వ అధికారులు ప్రవర్తించినట్టు కనిపిస్తోందని అన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 03:50 AM