ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: కాంగ్రెస్‌కు ఓటు వేయని సోనియా, రాహుల్‌..

ABN, Publish Date - May 25 , 2024 | 01:52 PM

ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెబితే గుర్తొచ్చేది కాంగ్రెస్‌ పార్టీ.. ఆ ఇద్దరు ఓటు ఎవరికి వేస్తారని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తు.. కానీ ఈ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు హస్తం గుర్తుకి ఓటు వేయలేదు.

ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెబితే గుర్తొచ్చేది కాంగ్రెస్‌ పార్టీ.. ఆ ఇద్దరు ఓటు ఎవరికి వేస్తారని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తు.. కానీ ఈ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు హస్తం గుర్తుకి ఓటు వేయలేదు. వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్లిద్దరూ పొరపాటున వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదు. పొత్తులో భాగంగా ఆ ఇద్దరూ వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సోనియా, రాహుల్ గాంధీకి ఓటు హక్కు ఉంది. దీంతో న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో వాళ్లిద్దరూ ఇవాళ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్


కాంగ్రెస్‌కు ఎందుకు వేయలేదంటే..

ఢిల్లీలో ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మొత్తం 7లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో ఆప్ నాలుగు స్థానాల్లో పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీచేస్తోంది. దీనిలో భాగంగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆమాద్మీ అభ్యర్థి భారతి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో సోనియా, రాహుల్ కాంగ్రెసేతర అభ్యర్థులకు ఓటు వేయాల్సి వచ్చింది. ఉదయం 9.30 గంటలకు నిర్మాణ్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు వేశారు. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకరవ్గం నుంచి ఆప్ అభ్యర్థిగా సోమనాథ్ భారతి పోటీచేస్తుండగా.. బీజేపీ అభ్యర్థిగా బీజేపీ దివంగత నేత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీచేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత సోనియా, రాహుల్ తమ చేతి వేలిపై సిరా చుక్కను చూపిస్తూ పోలింగ్ బూత్ బయట తీసుకున్న సెల్ఫీని రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు పండుగ లాంటివని.. అమ్మ, నేను ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నామని.. మిగతా ఓటర్లు తమ ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోరారు.


ఓటు వేసిన సోనియా కుటుంబం

సోనియా, రాహుల్‌తో పాటు.. వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా, కుమార్తె మిరాయా వాద్రా ఢిల్లీలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులంతా కలిసివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ప్రియాంక కుమారుడు, కుమార్తె మాట్లాడుతూ.. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని తాము భావిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు యువత ఓటు వేయాలన్నారు.


బుజ్జగింపులు, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 02:00 PM

Advertising
Advertising