Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ జూలై 12 వరకూ పొడిగింపు

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:28 PM

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12వ తేదీ వరకు బుధవారంనాడు పొడిగించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ జూలై 12 వరకూ పొడిగింపు

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (excise policy) స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12వ తేదీ వరకు పొడిగించింది. ఎయిమ్స్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు మెడికల్ కన్సల్టేషన్ల సమయంలో తన భార్యను అనుమతించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసుకున్న విజ్ఞప్తిపై నిర్ణయాన్ని జూలై 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కేజ్రీవాల్‌ను బుధవారంనాడు హాజరుపరిచారు.


బెయిలు పిటిషన్‌పై..

కాగా, తనపై సీబీఐ పెట్టిన కేసులో బెయిలు కోరుతూ కేజ్రీవాల్ బుధవారం ఉదయం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్‌ను గురువారంనాడు లిస్ట్ చేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రజత్ భరద్వాత్ కోర్టును కోరారు. సీఆర్‌పీసీలోని 41 సెక్షన్‌కు విరుద్ధంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అక్రమంగా కస్టడీలోకి తీసుకుందని ఆయన అన్నారు. దీంతో కేజ్రీవాల్ బెయిల్ అప్లికేషన్‌పై శుక్రవారంనాడు విచారణ చేపట్టేందుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ అంగీకరించారు.

Hathras Stampede: ప్రమాదమా? కుట్రా?.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యోగి


కేజ్రీవాల్‌ను తీహార్ జైలులో జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. మనీలాండిరింగ్ కేసులో ఈడీ అంతకుముుందే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో ఆయన తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తొలుత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అయితే జూలై 20న విచారణ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా, ఆ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 03 , 2024 | 04:28 PM