ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : మిమ్మల్ని రాష్ట్రం నుంచే బహిష్కరించారు! ఆ విషయం గుర్తుందా?

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:26 AM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఎన్సీపీ(ఎస్పీ) నేత, సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ల మధ్య రాజకీయం వేడెక్కింది. ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బీజేపీ సదస్సులో శరద్‌ పవార్‌ను ఉద్దేశించి ‘అవినీతి చక్రవర్తి’ అని షా వ్యాఖ్యానించారు.

  • మీలాంటి వ్యక్తి దేశానికి హోం శాఖ మంత్రా?

  • అమిత్‌ షాపై శరద్‌ పవార్‌ మాటకు మాట

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఎన్సీపీ(ఎస్పీ) నేత, సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ల మధ్య రాజకీయం వేడెక్కింది. ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బీజేపీ సదస్సులో శరద్‌ పవార్‌ను ఉద్దేశించి ‘అవినీతి చక్రవర్తి’ అని షా వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్షాలు అవినీతి గురించి మాట్లాడుతున్నాయి. అసలు దేశ రాజకీయాల్లో అతిపెద్ద అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉంటే ఆయన శరద్‌ పవారే’’ అని విమర్శలు గుప్పించారు.

దీనికి కౌంటర్‌గా తాజాగా స్పందించిన పవార్‌.. ‘‘మిమ్మల్ని గుజరాత్‌ నుంచి బహిష్కరించిన విషయం గుర్తుందా? లేక మరిచిపోయారా? మీలాంటి వ్యక్తి దేశానికి హోం శాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరం’’ అని నిప్పులు చెరిగారు. ‘‘ప్రస్తుతం ఈ దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి గుజరాత్‌లో చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు ఆయనకు రాష్ట్ర బహిష్కారం విధించింది. దీనిని బట్టి మనం ఎటు వెళ్తున్నామో, ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించుకోవాలి’’ అని పవార్‌ వ్యాఖ్యానించారు. సోహ్రబుద్ధీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించిన సుప్రీం కోర్టు 2010లో అమిత్‌షాపై రాష్ట్ర బహిష్కరణ విధించింది. కానీ, తర్వాత ఆయన నిర్దోషి అని తేల్చింది.

Updated Date - Jul 28 , 2024 | 03:26 AM

Advertising
Advertising
<