ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tamilnadu : దేవుడి హుండీలోకి భక్తుడి ఐఫోన్.. తర్వాత ఏమైందంటే..

ABN, Publish Date - Dec 21 , 2024 | 07:21 PM

తమిళనాడులో ఓ ఆలయానికి వెళ్లిన భక్తునికి వింత అనుభవం ఎదురైంది. హుండీలోకి డబ్బులు వేసేందుకు అతడు ముందుకు వంగినపుడు జేబులోంచి పొరపాటున ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే..

I Phone

దేవుని దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నాడు. హుండీ పెట్టెలో దక్షిణ వేయబోతుండగా అతడి జేబులో ఉన్న ఐఫోన్ ప్రమాదవశాత్తూ హుండీలోకి జారిపడింది. దీంతో కంగుతున్న భక్తుడు ఐఫోన్ ఇప్పించమని ఆలయ నిర్వాహకులను అభ్యర్థించాడు. ఇంతకీ, ఏం జరిగిందంటే..


చెన్నై: తమిళనాడులోని వినయగపురంలో నివసిస్తున్న దినేష్ తిరుపోరూరులోని కందస్వామి ఆలయానికి వెళ్లాడు. హుండీలో డబ్బులు వేస్తుండంగా పొరపాటున్న అందులోకి ఐఫోన్ పడిపోవడంతో.. ఆలయ అధికారులను సంప్రదించాడు. కానీ, దినేష్ అభ్యర్థనను వారు తిరస్కరించారు. ఒక్కసారి దేవుడి హుండీలోకి ఏ వస్తువు వెళ్లినా ఆలయ నిబంధనల ప్రకారం తిరిగివ్వరని తేల్చి చెప్పారు.


ఇన్‌స్టాలేషన్, సేఫ్‌గార్డింగ్, అకౌంటింగ్ ఆఫ్ హుండియల్ రూల్స్, 1975 ప్రకారం, హుండీలో వేసిన ఏ వస్తువులైనా దేవుని ఖాతాలోకే వెళతాయి. అవి ఎంత ఖరీదైనవైనా సరే. అందుకే, దినేష్ ఐఫోన్ తిరిగి ఇవ్వలేమని చెప్పారు కందస్వామి ఆలయనిర్వాహకులు. హుండీలో పడిన ఐఫోన్ ఇప్పుడు ఆలయ ఆస్తిగా మారటంతో.. దినేష్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఐఫోన్‌లోని డేటాను మాత్రమే తిరిగి పొందగలరని ఆలయ అధికారులు తెలిపారు.


ఈ ఘటనపై హిందూ ధర్మాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్‌బాబు స్పందించారు. హుండీలోకి నైవేద్యంగా సమర్పించిన ఏ వస్తువైనా దేవుడి ఖాతాలోకే వెళ్తుందన్నారు. భక్తులకు కానుకలను తిరిగి ఇవ్వడానికి ఆలయ నిబంధనలు అనుమతించవని మీడియాతో వెల్లడించారు. అయితే, అధికారులతో చర్చించి భక్తుడికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.


కాగా, ఇలాంటి ఘటన తమిళనాడులో ఇదే మొదటిది కాదు. కేరళలోని అలప్పుజకు చెందిన ఎస్ సంగీత అనే భక్తురాలు, మే 2023లో పళని శ్రీ దండాయుతపాణి స్వామి దేవాలయ హుండీలో ప్రమాదవశాత్తూ 1.75 తులాల బంగారు గొలుసు జారవిడిచింది. మెడలోని తులసి మాల తీసి వేసేటప్పుడు బంగారు గొలుసు కూడా హుండీలోకి పడిపోయింది. తర్వాత ఆలయ నిర్వాహకులు ఆమెకు కొత్త గొలుసు ఇప్పించారు.

Updated Date - Dec 21 , 2024 | 07:42 PM