DK Shivakumar: వంద కోట్ల ఆఫర్.. కాదనడంతో జైలుకు..?
ABN, Publish Date - May 18 , 2024 | 11:27 AM
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
బెంగళూర్: కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. ఆ వీడియోలు బయటకు వచ్చేందుకు వెనక కుట్ర జరిగిందని తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk shiva kumar) ఆ వీడియోలు బయటకు వచ్చేలా చేశారని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది డీకే టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు. వారిద్దరిని టార్గెట్ చేసేందుకు పనిచేస్తే రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారని వివరించారు. అడ్వాన్స్‌గా రూ.5 కోట్లు పంపించారని స్పష్టం చేశారు. తాను బౌరింగ్ క్లబ్ రూమ్ నంబర్ 110లో ఉన్న సమయంలో ఒకరిని పంపించారని తెలిపారు.
అంతా డీకే చేశారు..
కుమారస్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ డ్రైవర్ కార్తీక్ గౌడ నుంచి డీకే శివకుమార్ పెన్ డ్రైవ్ పొందారని దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వివాదం అయ్యేందుకు కారణం శివకుమార్ అని స్పష్టం చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియో వ్యవహారం వైరల్ అయిన ఘటనలో డీకే శివకుమార్ సహా ముగ్గురు మంత్రులు ఎన్ చెలువరాయస్వామి, కృష్ణ బైరె గౌడ్, ప్రియాంక్ ఖర్గే పాత్ర ఉందని దేవరాజే గౌడ ఆరోపించారు.
కక్ష గట్టి కేసు
‘శివకుమార్ చెప్పిన పని చేసేందుకు తాను అంగీకరించలేదు. తనపై కక్ష గట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు లభించకపోవడంతో మరో కేసు పెట్టారు. లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. డీకే శివకుమార్ రూ.100 కోట్లు ఇస్తాననే డీల్‌కు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయి. ఆ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. స్కాండల్ కేసుకు సంబంధించి సిట్ మీద తనకు నమ్మకం లేదు. సాక్ష్యాధారాలను సీబీఐకి మాత్రం అందజేస్తాను. తన వద్ద ఉన్న వీడియోలు విడుదలైన వాటికి భిన్నంగా ఉన్నాయి అని’ దేవరాజే గౌడ వివరించారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 18 , 2024 | 11:28 AM