ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ECI: భారత ఎన్నికల సంఘం కీలక జాబితా విడుదల.. విషయం ఏంటంటే..

ABN, Publish Date - Dec 30 , 2024 | 01:01 PM

లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది.

Lok Sabha Elections-2024

హైదరాబాద్: లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది. ఈసీఐ తాజా గణాంకాల నివేదిక ప్రకారం అతి తక్కువ ఓట్లు పోలై బీహార్‌లోని నవాడా మెుదటి స్థానంలో ఉండగా, పాట్నా సాహిబ్ రెండో స్థానంలో నిలిచింది. భారతదేశం మొత్తం మీద 2024 లోక్‌సభ ఎన్నికలలో 50 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాలు తొమ్మిది ఉన్నట్లు ఈసీఐ వెల్లడించింది.


నియోజకవర్గాల వారీ వివరాలు ఇవే..

బిహార్ రాష్ట్రం నవాడా నియోజకవర్గంలో మెుత్తం 20,10,286 ఓట్లు ఉండగా.. 2024 ఎన్నికల్లో కేవలం 8,71,838 ఓట్లు మాత్రమే పోలై అతి తక్కువగా 43.37 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. పాట్నా సాహిబ్(బిహార్) నియోజకవర్గంలో 22,95,527 ఓటర్లు ఉండగా.. 10,75,992 మంది ఓట్లు వేసి 46.87 శాతాన్ని నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నియోజకవర్గంలో మెుత్తం ఓటర్లు 22,17,305 ఉండగా.. 10,81,878 మంది మాత్రమే ఓటు హక్కును వియోగించుకుని 48.79 ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. అల్మోరాలో(ఉత్తరాఖండ్) 13,68,432 ఓటర్లు ఉండగా.. 6,75,014 మాత్రమే ఓటు వేసి 49.33 శాతం నమోదు చేశారు.


మధుర (ఉత్తర ప్రదేశ్)లో 19,39,130 ఓట్లు ఉండగా.. 9,57,463 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుని 49.38 శాతం నమోదు చేశారు. సికింద్రాబాద్(తెలంగాణ)లో 21,20,550 మంది ఉండగా.. 10,48,604 మంది ఓటు వేసి 49.45 శాతం నమోదు చేశారు. రేవా(మధ్యప్రదేశ్)లో 18,59,439 మంది ఓటర్లు ఉండగా.. కేవలం 9,20,062 మంది మాత్రమే వయోజన ఓటు హక్కును వినియోగించుకుని 49.48 ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్)లో 29,48,720 ఓట్లు ఉండగా.. 14,70,740 ఓట్లు పోలై 49.88 శాతం నమోదు అయ్యింది. నలంద(బిహార్) నియోజకవర్గంలో 22,93,994 మంది ఉండగా.. 11,44,956 మంది ఓటు హక్కు వినియోగించుకుని 49.91 శాతాన్ని నమోదు చేశారు.


రికార్డు బద్దలు..

హైదరాబాద్ నియోజకవర్గంలో లోక్‌సభ-2024 ఎన్నికల్లో ఏఐఎంఐఎం తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేయగా.. బీజేపీ తమ అభ్యర్థి మాధవిలతను నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో మెుత్తం 22,17,305 మంది ఓటర్లు ఉండగా.. 10,81,878 ఓట్లు పోలయ్యాయి. వీటిలో మాధవిలతకు 3,23,894 ఓట్లు రాగా.. అసదుద్దీన్ ఒవైసీ 6,61,981 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ 3,38,087 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. దీంతో అత్యధిక ఓట్లు సాధించి ఓవైసీ తన పాత రికార్డును తానే బద్దలు కొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Snow Fall: భారీగా కురుస్తున్న మంచు.. పరీక్షలు వాయిదా

Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు

Updated Date - Dec 30 , 2024 | 01:18 PM