ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు.. బెయిల్ కోసమే ఇలా..

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:26 PM

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్‌ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ ( Kejriwal ) తన షుగర్ లెవెల్స్‌ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు, చక్కెరను తింటున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు.


Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

జోహెబ్ వాదనలను తిప్పికొడుతూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ మీడియా కవరేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ డైలీ హెల్త్ రిపోర్ట్ ను ఈడీకి సమర్పించాలనే డిమాండ్ ను వ్యతిరేకించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


Summer Health: నిమ్మరసమా.. కొబ్బరి నీళ్లా.. వేసవిలో ఏది ప్రయోజనకరం..

ఏప్రిల్ 10న దిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గోవా ఎన్నికల కోసం కేజ్రీవాల్‌కు డబ్బు ఇచ్చారని పేర్కొంటూ ఈడీ పేర్కొంది. దిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 05:05 PM

Advertising
Advertising