Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:42 PM
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం వ్యవహరంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఆ క్రమంలో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అనుమతి ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే స్పందించింది.
Also Read: కువైట్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేసేందుకు భారతీయ జనతా పార్టీ పన్నాగం పన్నిందని విమర్శించింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేందుకు ఆ పార్టీ ఈ తరహా కుట్రకు తెర తీసిందని ఆరోపించింది. ఢిల్లీ మద్యం విధానంపై గత రెండేళ్లుగా ఈడీ దర్యాప్తు చేస్తుందని గుర్తు చేసింది. కానీ ఈ కేసులో నేటికి ఏమీ దొరక లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా.. దాదాపు 500 మందిని విచారణ పేరుతో హింసిస్తోందంటూ బీజేపీపై ఆప్ విమర్శలు గుప్పించింది.
Also Read: లయోలా కాలేజీ యాజమాన్యంపై మార్నింగ్ వాకర్స్ ఫైర్
ఇక మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మరింత సమయం ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈ ఇద్దరు నేతలు పిటిషన్ ద్వారా కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అందుబాటులో లేరంటూ జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీకి ఈడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై జనవరి 30వ తేదీన విచారణ జరుపుతామని జస్టిస్ ఓహ్రీ స్పష్టం చేశారు.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. ఆయన బెయిల్ కోసం పెట్టుకొన్న పిటిషన్లను సైతం తొసిపుచ్చింది. అయితే ఢిల్లీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్యాలంటూ పలు పార్టీలు డిమాండ్ చేశాయి.
Also Read: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
కానీ ఆయన రాజీనామా మాత్రం చేయలేదు. అయితే చివరకు సీఎం కేజ్రీవాల్‌కు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అనంతరం ఆయన.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో కేజ్రీవాల్ కేబినెట్‌లో కీలక మంత్రి అతిషికి సీఎంగా బాధ్యతలు కట్టబెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరసావహిస్తానని.. ఆ క్రమంలో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్... తన సీఎం పదవికి రాజీనామా చేసే సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంకోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మాజీ సీఎం కేజ్రీవాల్ ఎంపిక చేశారు. అనంతరం మూడు విడతలుగా జాబితాలుగా ఆయన విడుదల చేశారు.
For National News And Telugu News
Updated Date - Dec 21 , 2024 | 12:43 PM