ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: బీజేపీ కోసం కలిశాం.. ఈ బంధం శాశ్వతం కాదు

ABN, Publish Date - May 29 , 2024 | 04:55 PM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు.

Arvind Kejriwal

ఢిల్లీ, మే 29: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు శాశ్వతంగా ఉండదని ఈ సందర్బంగా కేజ్రీవాల్ కుండ బద్దలు కొట్టారు. బుధవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడారు.

Also Read: కరణ్ కాన్వాయి ఢీకొని ఇద్దరు మృతి


జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వెలువడనున్నాయని.. అందులో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. పక్కనే ఉన్న పంజాబ్‌లో మాత్రం ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగానే బరిలో నిలిచామని ఆయన వివరించారు. దేశాన్ని రక్షించడం కోసం.. బీజేపీని ఓడించడం కోసమే కాంగ్రెస్, ఆప్‌లు కలిసి ఒక అభ్యర్థిని బరిలో దింపామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్‌లో బీజేపీకి మనుగడ లేదన్నారు.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!


అలాగే ఢిల్లీ మద్యం కేసు.. మనీ లాండరింగ్ వ్యవహారంలో తాను డిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. అయితే తాను సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ మాత్రమే కోరుకుంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం దేశంలో ప్రముఖ రాజకీయ నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే పుతిన్ సారథ్యంలో రష్యాలో పరిస్థితి ఎలా ఉందో.. దాదాపు అదే పరిస్థితి భారత్‌లో వస్తుందన్నారు.

Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం విడి భాగాలు


మరోవైపు తన పార్టీ నేతలు సత్యంద్ర జైన్, మనీష్ సిసోడియాలు బీజేపీలో చేరితే వెంటనే బెయిల్ లభిస్తుందంటూ ఆ పార్టీ నేతల నుంచి సందేశాలు వెళ్లినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. ఇక సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ ఘటనపై స్పందించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధాని అవుతారని.. అలాగే యూపీ సీఎం పోస్ట్ నుంచి యోగి ఆదిత్యనాథ్‌ దిగిపోతారంటూ వివిధ వేదికల మీద నుంచి కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 05:00 PM

Advertising
Advertising