Farmers Protest: పంజాబ్‌లో రైళ్ల నిలిపివేత..?: ఓ వైపు కేంద్రంతో చర్చలు, మరోవైపు నిరసనలు
ABN, Publish Date - Feb 15 , 2024 | 10:33 AM
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఢిల్లీలో (Delhi) నిరసన చేపట్టేందుకు రైతులు 13వ తేదీన బయల్దేరిన సంగతి తెలిసిందే. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ కానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి. కొందరు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు
రైతుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీయడంతో చర్చలకు రావాలని రైతు సంఘం నేతలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఈ రోజు సాయంత్రం రైతు నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతారు. రైతు నేతలు- కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు రెండుసార్లు విఫలం అయ్యాయి. 13వ తేదీన రైతు నేతలు, రైతులు నిరసన చేపట్టేందుకు బయల్దేరారు. రైతులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు పంజాబ్‌లో రైళ్ల రాకపోకలకు రైతులు అంతరాయం కలిగించినట్టు తెలుస్తోంది.
అర్జున్ ముండాతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
రైతుల నిరసనల గురించి వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండాతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న (బుధవారం) సమావేశం అయ్యారని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. ఆ భేటీలో ఏయే అంశాలు చర్చించారనే దానిపై స్పష్టత లేదు. రాజ్‌నాథ్ సింగ్ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రైతుల డిమాండ్ల గురించి అర్జున్ ముండాను అడిగి తెలుసుకున్నట్టు సమచారం. గురువారం (ఈ రోజు) జరిగే చర్చల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 15 , 2024 | 10:34 AM