Share News

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

ABN , Publish Date - May 17 , 2024 | 04:53 PM

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మహిళా కమిషన్‌కి ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడానికి ఆప్ కారణమని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలని ఘాటు విమర్శలు చేశారు.

‘కేజ్రీవాల్ నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే సీఎం స్పందించకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనపై కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఆయన వెంట నిందితుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు దాడికి పాల్పడటం సిగ్గు చేటు. ఫిర్యాదు చేయడానికి ఇన్ని రోజుల సమయం పట్టిందంటే ఆమెపై ఎవరో ఒత్తిడి తెస్తున్నారని అర్థం అవుతోంది ’’ అని నిర్మలా అనుమానం వ్యక్తం చేశారు.


బాధితురాలికి గాయాలు..

కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతీమలీవాల్‌ను శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. తనపై దాడి చేసిన బిభవ్ కుమార్‌పై మలివాల్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో తనపై బిభవ్ కుమార్ జరిపిన దాడిని ఎక్స్ వేదికగా స్వాతి మలివాల్ వివరించారు. అయితే ఈ దాడి ఘటన తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందించడం ఇదే తొలిసారి. అలాగే ఈ దాడి జరిగిన మూడు రోజులకు పోలీస్ స్టేషన్‌లో బిభవ్ కుమార్‌పై ఆమె ఫిర్యాదు చేశారు.

For More National News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 04:54 PM