ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahadev Case: మహాదేవ్ యాప్ కేసు.. ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరు..

ABN, Publish Date - Mar 19 , 2024 | 01:43 PM

రూ. 6 వేల కోట్లు విలువైన మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరును చేర్చారు.

రూ. 6 వేల కోట్లు విలువైన మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరును చేర్చారు. దీనిపై స్పందించిన మాజీ సీఎం ఈ కేసు పూర్తిగా రాజకీయపరమైనదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించి కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం 72 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా 450 మందిని పైగా అరెస్టు చేసిందని బఘేల్ వివరించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా పూర్తి రాష్ట్రంలో బీజేపీకి నష్టం వాటిల్లుతుందని మాజీ సీఎం స్పష్టం చేశారు.

"మహాదేవ్ యాప్‌ను నిషేధించాలని మేము గూగుల్ కు లేఖ రాశాం. ఈ యాప్ మాత్రమే కాకుండా అనేక బెట్టింగ్ యాప్‌లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ కేసులో అసలు నిందితులను అరెస్టు చేయడం బీజేపీకి ఇష్టం లేద. కాన్సులేట్ జనరల్ సమక్షంలో స్పందించిన శుభమ్ సోనీని ఎందుకు అరెస్టు చేయలేదు. వారికి భారతదేశానికి తీసుకురావడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రవి ఉప్పల్‌పై లుకౌట్ నోటీసు సైతం జారీ చేశాం."

- భూపేష్ బఘేల్, మాజీ ముఖ్యమంత్రి


కాగా ఈ కేసులో బఘేల్ పై ఐపీసీ కింద నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, ఫోర్జరీకి సంబంధించిన వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11 నమోదు చేశారు. ఆయనతో పాటు మహాదేవ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ తో పాటు మరో 16 మంది పేర్లు చేర్చారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 01:43 PM

Advertising
Advertising