ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shivraj Singh Chouhan: ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:59 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు. రాహుల్ గాంధీ రెండు యాత్రలు చేశారని.. ఆ రెండూ కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రలుగా మారాయన్నారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌కు అన్యాయం చేస్తున్నారన్నారు. రాహుల్ యాత్ర చేసినప్పుడల్లా కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొంటుందని, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారని శివరాజ్‌ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు.

నాలుగు ప్రశ్నలు..

దేశ ప్రజల తరపున రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీకి తాను నాలుగు ప్రశ్నలు వేస్తున్నానని సమాధానం చెప్పగలరా అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారో రాహుల్‌తో పాటు మల్లికార్జున్ ఖర్గే చెప్పగలరా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కాంగ్రెస్ మహిళలకు మద్దతుగా ఎందుకు మాట్లాడలేదన్నారు. రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీపై అభ్యంతరకర ప్రకటనలు చేస్తున్నారని.. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై అభ్యంతరకర ప్రకటనలు చేయడం భారత సంస్కృతిలో లేదన్నారు. అది కాంగ్రెస్, ఇండియా కూటమి సంస్కృతిలో భాగమా అని ప్రశ్నించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ ఎందుకు పోటీ చేయడం లేదని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం ఎందుకు చూపించలేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని శివరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 04:12 PM

Advertising
Advertising