Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్‌డేట్ విషయంలో గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 12 , 2024 | 03:00 PM
మీరు ఆధార్ కార్డ్‌ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా. అయితే మీకో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే చివరి తేదీని మళ్లీ పొడిగించింది.
మీరు ఆధార్ కార్డ్(Aadhaar card)ను ఇంకా అప్‌డేట్(update) చేసుకోలేదా. అయితే మీకో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే చివరి తేదీని మళ్లీ పొడిగించింది. ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం జూన్ 14 వరకు తమ సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి ముందు మార్చి 14 దీనికి గడువు ఉండగా.. ఇప్పుడు దానిని పొడిగించారు. ఇక ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
అయితే ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటిగా మారింది. కానీ ఇది అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్‌లలో ఇది ప్రామాణిక గుర్తింపు కార్డుగా మారింది. అయితే అప్‌డేట్ చేసుకోవాలని అనుకునే వారు వారి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్(free aadhar update) చేసుకోవచ్చు. దీనికోసం ల్యాప్‌టాప్(laptop) లేదా స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
అదే సమయంలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి ఆధార్(aadhar) కార్డులు ఉన్నాయి. కానీ వారి చిరునామా(Address) మారిన లేదా ఆధార్ కార్డ్‌లోని వివరాలను మార్చుకునే క్రమంలో అనేక మంది పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు లేదా అడ్రస్ ప్రూఫ్‌ని అప్‌డేట్ చేయడం ద్వారా మీరు ఇంట్లోనే కూర్చొని మీ చిరునామాను మార్చుకోవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Haryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ