Share News

High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:09 PM

పంజాబ్‌ పఠాన్‌కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్‌ ప్రకటించారు.

High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?

శ్రీనగర్, జులై 26: పంజాబ్‌ పఠాన్‌కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్‌ ప్రకటించారు. అందులోభాగంగా ఆర్మీ స్కూల్స్‌ను మూసివేశారు. ఈ స్కూల్స్ తిరిగి సోమవారం ప్రారంభమవుతాయని వారు వెల్లడించారు.

Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం


గాలింపు చర్యలు తీవ్రతరం..

మరోవైపు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల కోసం అటు పోలీసులు, ఇటు భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పఠాన్‌కోట్ పరిసర ప్రాంతాలతోపాటు జమ్మూలో సైతం తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే అనుమానాస్పద వ్యక్తుల్లో ఒకరి ఊహా చిత్రాన్ని ఈ సందర్భంగా భద్రతా అధికారులు విడుదల చేశారు. సదరు వ్యక్తి... మంచి నీళ్లు కావాలంటూ గ్రామంలోని మహిళను కోరాడు.

ఆమె నీళ్లు ఇచ్చిన అనంతరం అతడు అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ మేరకు సదరు మహిళ వివరించిందని డీఐజీ రాకేశ్ విశాల్ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు ఆయన వివరించారు. ఇక పఠాన్‌కోట్ జిల్లాలో ఉగ్రవాద దాడి లేదా మరేదైనా విపత్కర సంఘటనలు ఎదుర్కోనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన మూడు క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఇటీవలే తమ వద్దకు వచ్చాయని పంజాబ్ పోలీసులు తెలిపారు.

Jammu KAshmir.jpg

Also Read: Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..


పఠాన్‌కోట్ పక్కనే జమ్మూ అందుకే...

జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లా సరిహద్దుల్లో పఠాన్‌కోట్ జిల్లా ఉంటుంది. గత నెలలో సైతం ఈ జిల్లాలో ఇదే తరహాలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఆ సమయంలో సైతం ఉన్నతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు 2015లో పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌లో.. 2016లో పఠాన్‌కోట్‌లోని ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అదీకాక జులై 26వ తేదీ.. కార్గిల్ దివస్. ఈ సందర్భంగా ఈ యుద్దంలో పలువురు సైనికులు మరణించారు. లదాఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో యుద్ద వీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మారకం వద్ద ప్రధాని మోదీతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సైతం యుద్ద వీరులకు ఘనంగా నివాళులర్పించారు.


పెరిగిన ఉగ్రదాడులు..

ఇక ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దాడులను అణిచి వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. అన్ని జాతీయ రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 04:10 PM