ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటక సీఎంకు షాక్‌

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:30 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మైసూర్‌ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.

  • ముడా స్కాంలో సిద్దరామయ్య ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర హైకోర్టు ఓకే

  • గవర్నర్‌ అనుమతిని సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్‌ కొట్టివేత

  • సిద్దూ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌

  • నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం

  • హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్‌?

  • నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష భేటీ

బెంగళూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మైసూర్‌ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. గవర్నర్‌ ఇచ్చిన అనుమతిని సవాల్‌ చేస్తూ సిద్దరామయ్య వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిద్దరామయ్య భార్య పార్వతి అక్రమమార్గంలో ముడా నుంచి 14 ఇంటి స్థలాలు పొందారని, ఆమె నుంచి ముడా సేకరించిన భూమి కంటే వీటి విలువ ఎన్నో రెట్లు అధికమని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, ప్రదీప్‌కుమార్‌, స్నేహమయి కృష్ణ గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన గవర్నర్‌.. సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీఎం సిద్దరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నెలరోజులపాటు విచారించి మంగళవారం తీర్పు ఇచ్చింది. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతించడం సమంజసమైనదని తీర్పులో స్పష్టం చేసింది. సీఎం కుటుంబసభ్యులు లబ్ధి పొందిన విషయం కావడంతో విచారణ జరగాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు రావడంతో కర్ణాటక రాజకీయాలలో కలకలం ఏర్పడింది.

బెంగళూరు నగర పర్యటనలో ఉన్న సిద్దరామయ్య హుటాహుటిన అధికారిక నివాసం కావేరికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రులు ఎంబీ పాటిల్‌, శివరాజ్‌ తంగడిగ, కృష్ణబైరేగౌడ, బైరతి సురేశ్‌ తదితరులు కూడా హుటాహుటి కావేరికి చేరుకున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కావేరికి చేరుకుంటున్నారు. ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన శాసనసభ స్పీకర్‌ యూటీ ఖాదర్‌ కూడా బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. హైకోర్టు తీర్పు మేరకు సీఎం ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పందించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని సూర్జేవాలా భరోసా ఇచ్చారు. న్యాయపోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. తద్వారా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అధిష్ఠానం పరోక్షంగా సందేశమిచ్చింది.


  • నేడు హైకోర్టు లేదా సుప్రీంలో పిటిషన్‌..

సిద్దరామయ్య పిటిషన్‌ను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తిరస్కరించడంతో ఆయన హైకోర్టు ఉన్నత ధర్మాసనం లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏకసభ్య ధర్మాసనం తీర్పు అనంతరం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి, మరో సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌తో ఫోన్‌లో చర్చించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సాధ్యమైనంత త్వరగా పిటిషన్‌ దాఖలు చేయాలని భావిస్త్తున్నట్టు సమాచారం. సిద్దరామయ్య తరఫున బుధవారం పిటిషన్‌ వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం అధికారిక నివాసం ‘కావేరి’ వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాజీనామా కోరుతూ మైసూరులో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

  • తప్పు చేయలేదు: సిద్దూ

ముడా ఇంటి స్థలాల విషయంలో తాను ఎటువంటి తప్పూ చేయలేదని సిద్దరామయ్య చెప్పారు. న్యాయవ్యవస్థపైనా, రాజ్యాంగంపైనా తనకు నమ్మకం ఉందని, న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. అంతిమ విజయం సత్యానిదేనన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురాలోచనతో కుట్ర పన్నారని, గవర్నర్‌ రాజకీయ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని ఆరోపించారు. తాజా రాజకీయ పరిస్థితులపై బుధవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Updated Date - Sep 25 , 2024 | 03:30 AM