Share News

Delhi Excise policy case: కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Jul 29 , 2024 | 07:58 PM

సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది.

Delhi Excise policy case: కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ: సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసు (Excise policy case)లో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ (CBI) వాదించింది. తమ విచారణలో కొత్త విషయాలు వెలుగుచూశాయని, వాటిని కొత్త ఛార్జిషీటులో ప్రస్తావించామని, రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఉదయం దానిని దాఖలు చేసామని కోర్టుకు విన్నవించింది. తమ విచారణలో కేజ్రీవాల్‌పై మరికొన్ని సాక్ష్యాలు వెలుగు చూశాయని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. కేజ్రీవాల్ సహా ఆరుగురు వ్యక్తుల పేర్లు ఛార్జిషీటులో నమోదు చేసినట్టు అడ్వకేట్ డీపీ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందులో ఐదుగురిని ఇంకా అరెస్టు చేయలేదని అన్నారు. పి.శరద్ చంద్ర రెడ్డి, దుర్గేష్ పాఠక్, వినోద్ చౌహన్, ఆశిష్ మాధుర్, అమిత్ అరోరా పేర్లు కొత్త ఛార్జిషీట్‌లో చోటుచేసుకున్నట్టు తెలిపారు.


కంప్యూటర్‌లో సేవ్ చేసేందుకు ఎక్సైజ్ పాలసీ కాపీని విజయ్ నాయర్ తెచ్చినట్టు మనీష్ సిసోడియా కింద ఉండే ఐఏఎస్ అధికారి సి.అరవింద్ సాక్షమిచ్చారని, ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నట్టు చెప్పారని, దానిని బట్టి ఈ కేసులో కేజ్రీవాల్ ప్రత్యక్ష ప్రమేయం ఉందనే విషయం తెలుస్తోందని సీబీఐ న్యాయవాది వాదించారు. మంత్రివర్గం నేతగా ఎక్సైజ్ పాలసీపై కేజ్రవాల్ సంతకం చేశారని, కేసులో ప్రధాన సూత్రధారి ఆయనేనని పేర్కొ్న్నారు.

Rajnath Singh: అగ్నివీరులపై ప్రకటనకు రెడీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం


సింఘ్వి వాదన ఇలా సాగింది...

కాగా, సీబీఐ న్యాయవాది వాదనను కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తోసిపుచ్చుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదన్నారు. విజయ్ నాయర్ ప్రధాన నిందితుడిగా సీబీఐ చెబుతోందని, అయితే సీబీఐ కేసులో ఆయనకు చాలా కాలం క్రితమే బెయిల్ వచ్చిందని వాదించారు. కేజ్రీవాల్‌ను కేసులో 'సూత్రధారి'గా సీబీఐ వాదిస్తు్న్నప్పటికీ దానిపై మాట్లాడటం లేదని అన్నారు. 2021లో పాలసీని పబ్లిష్ చేశారని, ఎక్సైజ్ పాలసీ సంస్థాగత నిర్ణయమని చెప్పారు. ఈకేసులో సీబీఐ వద్ద ఎలాంటి ప్రత్యక్ష సాక్షాలు లేవని, స్వాధీనం చేసుకున్నవి కూడా ఏమీ లేవన్నారు. ఇదొక రూమర్ మాత్రమేనని వాదించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 07:58 PM