Himachal Political Crisis: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ABN, Publish Date - Feb 29 , 2024 | 01:16 PM
రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో గీత దాటిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ స్పీకర్ (Speaker) చర్యలు తీసుకున్నారు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేత, మంత్రి హర్ష వర్ధన్ స్పీకర్ కుల్దీప్ సింగ్‌ను (kuldeep Singh) కోరారు. క్రాస్ ఓటింగ్ వేసిన ఆరుగురు సభ్యులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు అల్పహార విందు భేటీ నిర్వహించారు. ఆ సమావేశానికి 32 మంది సభ్యులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. మరో 8 మంది సభ్యులు సీఎంతో సమావేశానికి రాలేదు. ఆ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుగురు సభ్యులపై చర్యలు తీసుకుంది. ఆరుగురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.
Himachal Political Crisis: ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ..? ఎందుకంటే..?
ఎమ్మెల్యేల డుమ్మా
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) సీఎం నిర్వహించిన సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడంతో ప్రభుత్వం కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. సభలో తగినంత మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో అందుకు తగినట్టు ఆరుగురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కి తగ్గుతుంది. మెజార్టీ మార్క్ 32కి చేరుతుంది. కాంగ్రెస్ వెంట 32 మంది సభ్యులు ఉండటంతో తమ ప్రభుత్వానికి ఢోకా లేదని కాంగ్రెస్ నేతలు లెక్కగడుతున్నారు.
ఢోకా లేదు
రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతోందని సీఎం సుఖు ధీమాతో ఉన్నారు. తనను రాజీనామా చేయలేదని హైకమాండ్ కోరలేదని స్పష్టం చేశారు. దాంతో తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 02:47 PM