Pushpa Poster War: 'పుష్ప 2' స్టిల్స్‌తో ఆప్-బీజేపీ పోస్టర్ వార్
ABN, Publish Date - Dec 09 , 2024 | 09:37 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: అల్లు అర్జున్ 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం ఓవైపు వివిధ భాషల్లో విడుదలై ఆలిండియా బాక్సాఫీస్ కలెక్షన్లను షేక్ చేస్తుంటే, మరోవైపు 'పుష్ప 2' స్టిల్స్, డైలాగ్‌ల ప్రేరణతో దేశరాజధానిలో పోస్టర్ వార్ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తు్న్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది. ఇందుకు దీటుగా బీజేపీ 'రప్పా రప్పా' పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే
''నాలుగోసారి కూడా అధికారం మాదే'' అనే అర్థంలో కేజ్రీవాల్ 'ఝుకేగా నహీ' అంటున్నట్టు చూపించే పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుండటంతో బీజేపీ సైతం పోటాపోటీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఆ పోస్టర్‌లో కుర్చీలో కూర్చుని 'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ తరహాలో లుంగీలో కనిపిస్తారు. ''అవినీతిని అంతం చేస్తాం'' (రఫ్పా రఫ్పా) అంటూ ఆ పోస్టర్‌పై రాసుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. నాలుగోసారి కూడా అధికారం కోసం పట్టుదలగా ముందస్తు ప్రచారం మొదలుపెట్టేసింది. 1998 నుంచి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఢిల్లీ రాజకీయాల్లో 'ఆప్' హవాకు ఈసారి గండికొట్టాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ''ఈసారి ఉపేక్షించం, మార్పు తీసుకువస్తాం'' అనే నినాదాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి..
Jagdeep Dhankar: జగ్‌దీప్ ధన్‌ఖఢ్‌పై 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానం
Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఫడ్నవిస్ సర్కార్
పాక్‌కు బంగ్లా మరింత చేరువ!
Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి
Updated Date - Dec 09 , 2024 | 09:46 PM