J&K Elections Exit Polls: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పరిస్థితి ఏంటి.. సంచలన సర్వే రిపోర్ట్..
ABN, Publish Date - Oct 05 , 2024 | 08:13 PM
Jammu and Kashmir Assembly Elections Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయ సాధిస్తుందనే అంచనాలను ప్రకటించేశాయ్.. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టారు.. ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించనుంది.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. వంటి పూర్తి వివరాలను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్‌లో ప్రకటించేసింది..
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయ సాధిస్తుందనే అంచనాలను ప్రకటించేశాయ్.. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టారు.. ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించనుంది.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. వంటి పూర్తి వివరాలను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్‌లో ప్రకటించేసింది పీపుల్స్ పల్స్ సర్వే. ఈ సంస్థ జమ్మూ కశ్మీర్, హర్యానాలో సర్వే నిర్వహించింది. హర్యానాలో కాంగ్రెస్‌దే గెలుపు అని అంచనా వేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోనూ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమిదే హవా అని తేల్చింది.
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు తరువాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే అంచనాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..
అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు అని అభిప్రాయపడింది. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్‌సభ సభ్యులు రషీద్‌కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.
కాంగ్రెస్-జేకేఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది కాంగ్రెస్-జేకేఎన్సి కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. జమ్మూకాశ్మీర్‌లో జేకేఎన్సీ పార్టీకి 30-35 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక పీడీపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ శాతం ఓట్లు వచ్చి.. సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.
గత ఎన్నికల్లో పీడీపీ-బీజేపీ కలిసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆర్టికల్ 370 ఎత్తివేయడంపై కశ్మీర్ వాసులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు నిరుద్యోగ సమస్య, మౌలిక వసతుల లేమి, అధిక ధరలు, రాష్ట్ర హోదా లేకుండా న్యాయం జరగదని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు అనేక హామీలు ఇచ్చింది. రాష్ట్ర హోదా కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీని ఆలస్యం చేసింది. దీంతో బీజేపీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
Also Read:
గుప్తనిధుల కోసం వెళ్లారు.. అడ్డంగా బుక్కయ్యారు..
ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?
కోబ్రాను చుట్టేసిన కొండచిలువ.. చివరకు ..
For More National News and Telugu News..
Updated Date - Oct 05 , 2024 | 08:31 PM