ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

ABN, Publish Date - Jun 13 , 2024 | 02:35 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు..

Trains

భోపాల్, జూన్ 13: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు.. మరో రైలు అంశం కూడా చేరింది. నిందితులు.. బాలిక శరీర భాగాలను రెండు రైళ్లలో పడేసి.. మూడో రైలులో పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..


శనివారం నాడు మోవ్ నుండి నాగ్డా మీదుగా ఇండోర్‌కు తిరిగి వస్తున్న రైలులో ట్రాలీ బ్యాగ్, గోనె సంచులలో ఒక బాలిక శరీర భాగాలు కనిపించాయి. తల, మొండెం మాత్రమే ఆ బ్యాగ్‌లో ఉన్నాయి. కాళ్లు, చేతులు లబించలేదు. అదే రోజు లక్ష్మీబాయి నగర్‌ నుంచి బయలుదేరి రిషికేశ్‌ చేరుకున్న రైలులో ఎస్‌-1, ఎస్‌-2 కప్లింగ్‌ మధ్య బియ్యం బస్తాలో రెండు చేతులు, రెండు కాళ్లు కనిపించాయి. వీటిని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు.


ఈ ఘటన శనివారం జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. రైళ్ల రాకపోకలను, అందులో ప్రయాణించిన వారిని పరిశీలించారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల మద్య రెండు రైళ్లు ఉజ్జయిని ప్లాట్‌ఫారమ్ నెంబర్ 2, 3పై ఉన్నాయని.. అప్పుడే నిందితులు ఈ బస్తాలను రైళ్లలో వేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అదేవిధంగా ప్లాట్‌ఫామ్ నెంబర్ 5పై నిలిచి ఉన్న మరో రైలు నుంచి నిందితులు తప్పించుకుని ఉంటారని భావిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించినా.. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. నిందితులను కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిందితులెవరో తెలిపిన వారికి రూ. 10 వేలు రివార్డ్ కూడా ఇస్తామని ప్రకటించారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 13 , 2024 | 02:35 PM

Advertising
Advertising