ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sharad Pawar: మహారాష్ట్ర మరో మణిపూర్ కావచ్చన్న పవార్.. తప్పుపట్టిన బీజేపీ

ABN, Publish Date - Jul 29 , 2024 | 05:19 PM

మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే అన్నారు.

ముంబై: మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే (Chandrashekhar Bawankule) అన్నారు. మహారాష్ట్రలో హింస, కుల ఘర్షణలు చోటు చేసుకోవచ్చని శరద్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగస్తున్నాయని, రాష్ట్రానికి 40 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు తాను ఊహించలేదని చెప్పారు.


శరద్ పవార్ ఏమన్నారు?

శరద్ పవార్ ఆదివారంనాడు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, అక్కడ హింసను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. మహారాష్ట్రలో కూడా మరాఠా రిజర్వేషన్ల కోసం నిరసనలు జరుగుతున్నాయని, మణిపూర్ తరహాలోనే ఇక్కడ కూడా హింసాత్మక ఘటనలు తలెత్తే అవకాశాలున్నాయని అన్నారు. అయితే ఎందరో మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పొంపొందించేందుకు కృషి చేసినందున అలాంటి ఘటనలు జరక్కపోవచ్చని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా, ఓసీబీ కమ్యూనిటీల మధ్య అసంతృప్తులు పెరుగుతున్నందున మరాఠా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే పాటిల్, ఓబీసీ నేతలతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.

Uttar Pradesh: కన్వర్ యాత్రికుల అగ్రహం.. 'పోలీస్' స్టికర్ వాహనం ధ్వంసం


దిగజారుడు రాజకీయాలు వద్దు..

కాగా, పవార్ వ్యాఖ్యలపై చంద్రశేఖర్ బావన్‌కులే స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రజలు హింసను ప్రోత్సహించరని, పవార్‌కు ఆ అవిషయం తెలిసినప్పటికీ దిగజారుడు రాజకీయాలను ఆయన కోరుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం మహారాష్ట్రను, ప్రజలను పవార్ అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా అదుపు చేసే సామర్థ్యం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షంలోని కొందరు నేతలు అశాంతిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనేది నిజమని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కులాల మధ్య చిచ్చుకు విపక్ష నేతలు ప్రయత్నించారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బావన్‌కులే పేర్కొ్న్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 05:19 PM

Advertising
Advertising
<