Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?
ABN , Publish Date - Apr 03 , 2024 | 06:52 PM
మహారాష్ట్ర విపక్ష కూటమిలో సీట్ల పోటు ఎక్కువైంది. కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ నిరుపమ్ పోటీ చేయాలని భావించిన ముంబై నార్త్ వెస్ట్నుంచి ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థిని ప్రకటించింది. దాంతో సంజయ నిరుపమ్ భగ్గుమన్నారు. శివసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని హైకమాండ్‌కు సిఫారసు చేసింది.
ముంబై: మహారాష్ట్ర విపక్ష కూటమిలో సీట్ల పోటు ఎక్కువైంది. కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ నిరుపమ్ పోటీ చేయాలని భావించిన ముంబై నార్త్ వెస్ట్ (Mumbai) నుంచి ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థిని ప్రకటించింది. దాంతో సంజయ నిరుపమ్ భగ్గుమన్నారు. శివసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని హైకమాండ్‌కు సిఫారసు చేసింది. సంజయ్ నిరుపమ్‌పై కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి సంజయ్ నిరుపమ్ పేరు తొలగించాలని సిఫారసు చేసింది. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై సంజయ్ నిరుపమ్ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికీ తనకు అన్ని తలుపులు తెరిచే ఉన్నాయని బహిరంగ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ వీడే అంశానికి సంబంధించి గురువారం ఉదయం 11.30 గంటలకు స్పష్టత ఇవ్వనున్నారు.
ఏం జరిగిందంటే..?
ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ స్థానం నుంచి శివసేన యూబీటీ అమోల్ పేరును ఖరారు చేసింది. ఆ సీటును ఆశించిన సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శివసేన తీరును తప్పు పట్టారు. ‘ముంబైలో మొత్తం ఆరు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఐదు చోట్ల శివసేన అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక చోటును కాంగ్రెస్ పార్టీకి వదిలేసింది. శివసేన తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసేదిలా ఉంది. శివసేన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా అని’ సంజయ్ నిరుపమ్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Sumalatha: బీజేపీలో చేరుతున్నా.. ఆయనకు మద్దతిస్తున్నా..
Woman: ఏడాదికి రూ.కోటి సంపాదించే వరుడు కావలెన్.. సోషల్ మీడియాలో పోస్ట్, వైరల్